చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరినీ కరోనా వైరస్ తెగ టెన్షన్ పెడుతోంది.ఈ మధ్య కాలంలో సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీలలో సైతం ఎక్కువమంది కరోనా బారిన పడుతున్నారు.
మరి కొందరు సినీ ప్రముఖులు వైరస్ సోకి ప్రాణాలు కోల్పోతున్నారు.కరోనా సోకిందని తెలిసిన వెంటనే భయంతో కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు సైతం చోటు చేసుకుంటున్నాయి.
అయితే స్టార్ హీరోయిన్ సమంత కరోనా బారిన పడ్డవారిలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు.ప్రస్తుతం దేశంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల నుంచి నమ్మకం, సానుకూల దృక్పథం మాత్రమే రక్షిస్తాయని సమంత పేర్కొన్నారు.
తెలుగు, తమిళ భాషల్లోని సినిమాల్లో సమంత నటిస్తుండగా ఆమె నటించిన ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్ త్వరలో విడుదల కానుంది.కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరిలో వైరస్ తో పోరాడగలమనే ధైర్యం ఉండాలని సమంత అన్నారు.

ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆ పరిస్థితులను తట్టుకొని నిలబడగలిగే విధంగా మనలో ధైర్యం ఉండాలని సమంత పేర్కొన్నారు.కరోనా వల్ల ఏర్పడిన కష్టాలను తలచుకుని ప్రాణాలను కోల్పోవద్దని ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ధైర్యాన్ని మాత్రం కోల్పోకుండా ఉండాలని సమంత చెప్పుకొచ్చారు.కరోనా వ్యాక్సిన్ త్వరలోనే ప్రజలందరికీ అందుబాటులోకి వస్తుందని ఆమె అన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్ సోకకుండా మాస్క్ ధరిస్తూ భౌతిక దూరాన్ని పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కరోనాను జయించవచ్చనే విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మరవద్దని సామ్ పేర్కొన్నారు.
కర్పోనా వల్ల ప్రజల్లో భయాందోళన నెలకొన్న తరుణంలో సమంత ప్రజల్లో ధైర్యం నింపడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు.మరోవైపు ప్రస్తుతం సమంత చేతిలో తెలుగులో శాకుంతలం సినిమా మాత్రమే ఉంది.
గుణశేఖర్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది.