ప్రస్తుతం ఆసుపత్రులలో ఉధ్వేగపూరిత వాతావరణం ఉంది.కోవిడ్ సెకండ్ వేవ్ లో కరోనా బారిన పడిన వారు చాలా మంది ఆక్సీజన్ అందక మరణిస్తున్న పరిస్థితి ఉంది.
అయితే ఇప్పుడు ఈ సంకటమైన పరిస్థితి నుండి బయటపడేయడానికి అందరూ తమ శక్తికి మించి ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.అయితే ముఖ్యంగా కరోనా అనేది ఊపిరితిత్తులపై దాడి చేస్తున్నది కావున కరోనా సీరియస్ స్టేజ్ లో ఆక్సీజన్ సిలిండర్ అవసరం పడుతోంది.
అయితే ఈ పరిస్థితులలో ఓ వ్యాపారి చేస్తున్న పనితో ఒక్కసారిగా దేవుడిలా మారిపోయాడు.
ఇంతకీ అతను చేస్తున్న పని ఏంటంటే కరోనా నుండి కాపాడడంలో కీలకపాత్ర పోషించే ట్యాబ్లెట్ లను ఒక్కో కంపెనీ, ఒక్కో ధరకు అధిక లాభర్జన ఆశతో విక్రయిస్తున్న పరిస్థితులు నేడు ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్ లోని హమీపూర్ జిల్లాలో రిమ్ ఝిమ్ ఫ్యాక్టరీకి చెందిన ఓ వ్యాపారి ఒక్క రూపాయికి ఆక్సీజన్ సిలిండర్ ను రీఫిల్లింగ్ చేసి తన ప్లాంట్ నుండి ఆసుపత్రులకు అందజేస్తున్నారు.ఈ వ్యాపారి దయాగుణానికి కరోనా బాధితుల బంధువులు నువ్వు దేవుడివి సామి అంటూ ఆ వ్యాపారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
అయితే కష్ట కాలంలో నా పరిధిలో చేయగలిగిన సహాయం చేస్తున్నానని వ్యాపారి ఎంతో హుందాగా సమాధానమివ్వడం కొస మెరుపు.