సినిమా అనేది అందరికీ ఇష్టం ఉంటుంది.అలాగే సినిమా పరిశ్రమకు కూడా వెళ్లాలని ఉంటుంది.
కాని ఎవరైనా సినిమా పరిశ్రమకు వెళ్లాలని ఉంది అని ఎవరికైనా చెప్తే వారు చెప్పే ముందు మాట అక్కడ బ్యాక్ గ్రౌండ్ లేకపోతే రానించలేము.సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారికే ఎక్కువ అవకాశాలు వస్తాయని బయట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.
కాని అది వాస్తవం కాదు అన్న విషయం చాలా మంది స్టార్ ల విషయంలో రుజువయింది.ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న యంగ్ హీరోలలో టాప్ రేంజ్ లో దూసుకుపోతున్న స్టార్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ.
ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా పరిశ్రమలోకి వచ్చి చిన్న చిన్న పాత్రలు పోషించి ఇప్పుడు ఓ స్టార్ గా దూసుకెళ్తున్న పరిస్థితి.ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఓ విషయంలో మహేష్ బాబు, అల్లు అర్జున్ లను వెనక్కినెట్టాడు.
అది ఎందులో అని అనుకుంటున్నారా సోషల్ మీడియాలో.ప్రస్తుతం సోషల్ మీడియాలో స్టార్ హీరోలు యాక్టివ్ గా ఉంటున్న పరిస్థితి తెలిసిందే.
అయితే ఇంస్టాగ్రామ్ లో విజయ్ దేవర కొండకు కోటి 14 లక్షల మంది ఫాలోయర్స్ తో తెలుగులో మొదటి స్థానంలో ఉండగా, కోటి మంది ఫాలోయర్స్ తో అల్లు అర్జున్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.ఇక 60 లక్షల 30 వేల ఫాలోయర్స్ తో మహేష్ బాబు మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.