తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపక్షాల నుండి విమర్శలు ఎదురవుతున్నాయంటే పెద్దగా ఆశ్చర్యపడే విషయం ఏమీ లేదు.ఎందుకంటే రాజకీయాలు ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజమే.
కాని సొంత పార్టీ నేతలే సూటిగా విమర్శించకుండా ఏదో నీతి వాక్యాలు బోధించినట్టుగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారా లేక వేరే వారిని విమర్శిస్తున్నారా అన్నది అర్థం కాకపోతే కళ్ళలో నలుసులా అలా నేత మాటలు ఇబ్బంది పెడుతాయి.ప్రతిపక్షాలు ఇక ఆ మాటలను ఆసరాగా చేసుకొని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది.
అయితే అచ్చం ఇప్పుడు తెలంగాణలో ఇలా వ్యవహరిస్తున్న నేతలు ఎవరో మనకు తెలిసిందే.వారే మంత్రి ఈటెల రాజేందర్.
కేసీఆర్ కు ఈటెలకు ఎక్కడ చెడిందో ఏమో కాని ఒక్కసారిగా ఉన్నట్టుండి కేసీఆర్ కు వ్యతిరేకంగా మారారు.ఇక బహిరంగ సభల్లో డైరెక్ట్ గా ప్రభుత్వం పై ఘాటుగా విమర్శలు చేయడంతో అప్పుడు ఈటెల వ్యాఖ్యలు కేసీఆర్ ను ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉంది.
ఆ తరువాత కేటీఆర్ కేసీఆర్ తీసుకెళ్లి ఓ రహస్య భేటీ జరగడంతో ఇక కేసీఆర్ కు ఈటెలకు సయోధ్య కుడిరిందని అందరూ అభిప్రాయ పడ్డారు.అయితే తాజాగా వరంగల్ మునిసిపల్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి జరిగిన సమయంలో చేసిన వ్యాఖ్యలు మరో సారి వైరల్ గా మారాయి.
ప్రజలకు రాజకీయాల మీద కాని, రాజకీయ నాయకులపై నమ్మకం పోయిందని, అప్పట్లో రాజకీయ నాయకునికి ప్రజలు గౌరవం ఇవ్వడం మానేశారని ఈటెల వ్యాఖ్యానించారు.మరి ఈ వ్యాఖ్యలపై ఇంకా టీఆర్ఎస్ నేతలు స్పందించకున్నా వారిపైనే పరోక్షంగా వ్యాఖ్యానించారని రాజకీయ విష్లేషకులు అభిప్రాయపడుతున్నారు.