బిగ్ బాస్ షో తెలుగు సీజన్1 లో పాల్గొని ప్రేక్షకుల్లో నటుడు ఆదర్శ్ బాలకృష్ణ బాగానే గుర్తింపును సంపాదించుకున్నారు.ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 1 మంచి టీఆర్పీ రేటింగ్ లను సొంతం చేసుకోవడంతో పాటు ఆ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లకు ఎక్కువ సంఖ్యలో అవకాశాలను తెచ్చిపెట్టింది.
బిగ్ బాస్ షో తర్వాత ఆదర్శ్ బాలకృష్ణకు సినిమా ఆఫర్లు సైతం పెరిగాయి.అయితే ఈ టాలెంటెడ్ నటుడిని కరోనా వల్ల కష్టాలు చుట్టుముట్టాయి.
కొన్ని రోజుల క్రితం ఆదర్శ్ బాలకృష్ణకు కరోనా నిర్ధారణ అయింది.అతనితో పాటు అతని ఫ్యామిలీ కూడా కరోనా బారిన పడింది.అయితే ఆదర్శ్ కు కరోనా సోకడం వల్ల ఒక సినిమా నుంచి అతనిని తీసివేయడం గమనార్హం.తనకు, తన కుటుంబ సభ్యులకు కరోనా సోకిందని ఈ నటుడు సినిమా టీమ్ కు సమాచారం ఇవ్వగా ఆదర్శ్ కు మాట మాత్రమైనా చెప్పకుండా సినిమా టీమ్ మరో నటుడిని అతని స్థానంలో ఎంపిక చేసుకున్నారు.

సినిమా టీమ్ ఆ విధంగా చేయడంతో తనకు జరిగిన అన్యాయం గురించి ఆదర్శ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.అయితే తనను ఏ సినిమా నుంచి తొలగించారనే విషయాన్ని మాత్రం ఆదర్శ్ చెప్పలేదు.ఆదర్శ్ త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని అభిమానులు కామెంట్లు పెట్టడంతో పాటు ప్రతిభ ఉన్నవాళ్లకు ఒక అవకాశం పోయినా ఇంకో అవకాశం వస్తుందంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
కరోనా మహమ్మారి వల్ల ఇప్పటికే పలు సినిమాల షూటింగు లు ఆగిపోగా ఆచార్య, ఆర్ఆర్ఆర్ సినిమాల షూటింగ్ లపై కరోనా ప్రభావం పడినట్టు తెలుస్తోంది.
కరోనా వైరస్ సినిమా రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వాళ్లకు సమస్యలను క్రియేట్ చేస్తుండటం గమనార్హం.