భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో అభిమానులను సంపాదించుకుంటూ ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ అన్ని భాషల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటున్న నటులలో విజయ్ సేతుపతి ఒకరు.ఈ పాత్ర, ఆ పాత్ర అనే తేడాల్లేకుండా విజయ్ సేతుపతి సినిమాసినిమాకు మార్కెట్ ను పెంచుకుంటున్నారు.
సినిమాల్లోకి విజయ్ సేతుపతి ఎంట్రీ ఇవ్వకముందు దర్శకుడు బాలు మహేంద్రను చూడాలని అనుకున్నారు.
ఆయన అపాయింట్ మెంట్ తీసుకుని విజయ్ సేతుపతి కలవగా బాలు మహేంద్ర విజయ్ సేతుపతితో ఇప్పటికిప్పుడు మీకు సరిపడే పాత్రలేవీ తన సినిమాలో లేవని అన్నారు.
బాలు మహేంద్ర అలా అనగానే తాను సినిమా అవకాశం కోసం రాలేదని మీరు మంచి ఫోటోగ్రాఫర్ కాబట్టి నా ఫోటోలు తీసిపెట్టమని బాలుమహేంద్రను విజయ్ సేతుపతి అడిగారు.అప్పటికే స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న బాలు మహేంద్ర నన్నెవరూ ఇలా అడగలేదని విజయ్ సేతుపతితో చెప్పారు.
ఆ తరువాత బాలు మహేంద్ర విజయ్ సేతుపతి ఫోటోలు తీసి అతనిని మంచి నటుడివి అవుతావని చెప్పారు.అయితే విజయ్ సేతుపతి భార్యకు మాత్రం విజయ్ సేతుపతి సినిమాల్లో నటించడం ఇష్టం లేదు.డిగ్రీ చదివిన తరువాత విజయ్ సేతుపతి సిమెంట్ కంపెనీలో చేరాడు.కేరళకు చెందిన జెస్సీని విజయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.ఆ తరువాత తండ్రి ప్రోత్సాహంతో విజయ్ సేతుపతి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.పుదుప్పేటై, సన్నాఫ్ మహాలక్ష్మి, వర్ణం అనే సినిమాలలో చిన్నచిన్న పాత్రలకు విజయ్ సేతుపతి ఎంపికయ్యారు.
ఆ మూడు సినిమాలకు సంబంధించి టైటిల్ కార్డ్స్ లో విజయ్ సేతుపతి పేరు పడలేదు.ఆ సినిమాలకు రోజుకు 250 రూపాయలు విజయ్ సేతుపతి తీసుకున్నారు.ప్రస్తుతం కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్న విజయ్ సేతుపతి తొలి పారితోషికం కేవలం 250 రూపాయలు కావడం గమనార్హం.