ప్రస్తుతం కరోనా వల్ల ప్రజలందరు భయాందోళనలో ఉన్న విషయం తెలిసిందే.అసలు తగ్గిపోయిందని ఊపిరి పీల్చుకున్న ఈ వైరస్ మరింత బలంగా మారి విలయ తాండవం చేస్తున్నది.
ఇక ఈ శతాబ్ధం గుర్తుండిపోయే విధంగా చరిత్రలో నిలుస్తున్న కరోనాను చచ్చేదాక మరచిపోరు.ఒక్క రాష్ట్రం అని కాదు.
ప్రతి రాష్ట్రంలోని ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తుంది.
ఇకపోతే ఏపీలో కూడా కోవిడ్ ఉదృతి కొనసాగుతుంది.
రోజురోజుకూ కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్యతో పాటుగా మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరిగిపోతున్నది.ఈ క్రమంలో ఇదివరకే ఏపీ పోలీస్ శాఖలో కరోనా బారినపడి పలువురు పోలీసులు మృతిచెందగా, తాజాగా మరో పోలీస్ అధికారిని ఈ కరోనా మహమ్మారి బలితీసుకున్నది.
విజయనగరం సీసీఎస్ డీఎస్పీగా పనిచేసే జుత్తు పాపారావుకు ఇటీవల కరోనా నిర్ధారణ అవగా, విశాఖపట్నంలోని శ్రద్ధ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.ఈ క్రమంలో ఆదివారం తెల్లవారు జామున పరిస్థితి విషమించడంతో ఆయన మృతిచెందారు.
కాగా ఆయన భార్య పిల్లలకు కూడా కరోనా సోకగా వారు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.