టీడీపీ నేతల వార్.. తిరుపతి ఉప ఎన్నిక నిర్వహణలో విఫలమైన ఈసీ..

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలో, తెలంగాణలోని నాగార్జునసాగర్ నియోజక వర్గంలో ఉప ఎన్నిక పోలింగ్ పోరు ఈ రోజుతో ముగిసిన విషయం తెలిసిందే.

కాగా ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ కరోనా కారణంగా సాయంత్రం 7 గంటల వరకూ జరిగింది.

ఇదిలా ఉండగా పోలింగ్‌లో దొంగ ఓట్లు వేశారంటూ టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి లిఖిత పూర్వకంగా అలిపిరి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.మరోవైపు టీడీపీ నేతలు కూడా తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా భారీ ఎత్తున దొంగ ఓట్ల దందా నడిచిందని ఆరోపిస్తుండగా, తిరుపతి అసెంబ్లీ స్థానం పరిధిలో అక్రమాలు జరిగాయని, భారీగా అక్రమాలకు పాల్పడ్డారని, అందుకే తిరుపతి అసెంబ్లీ స్థానం పరిధిలో రీపోలింగ్ జరపాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సీఈసీకి లేఖ రాశారు.

మరో వైపు తిరుపతి ఉప ఎన్నిక నిర్వహణలో ఈసీ విఫలమైందని గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపణలు గుప్పించారు.నోడల్ అధికారుల నుంచి వివరాలు తీసుకుని ఈసీ విచారణ జరపాలని కోరారు.

వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!
Advertisement

తాజా వార్తలు