బ్రాండ్ అంబాసిడర్ గా సోనూసూద్.. దేనికో తెలుసా?

ప్రపంచమంతటా మంచి పేరు సంపాదించుకున్న సినీ నటుడు సోనూసూద్ పరిచయం గురించి ఎంత చెప్పినా తక్కువే.కరోనా సమయంలో దేవుడిలా వచ్చిన ఈ నటుడు.

 Sonu Sood, Covid Vaccination Program, Brand Ambassador, Bollywood,latest News,vi-TeluguStop.com

కరోనా బాధితులను వలస ప్రాంతాలలో చిక్కుకున్న వారిని తమ సొంత ప్రాంతాలకు చేర్చి ఆదుకున్నాడు.అంతే కాకుండా ఎంతో మంది ప్రజలను తనకు తోచిన సహాయం తో ముందుకు వచ్చాడు.

ప్రస్తుతం జనాల గుండెల్లో రియల్ హీరోగా ముద్ర వేసుకున్నాడు.ఇక ఇప్పటికే తన సహాయాన్ని అందిస్తూనే ఉన్నాడు‌.

ఇదిలా ఉంటే తాజాగా ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచాడు.

ప్రస్తుతం కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలకు వ్యాక్సిన్ టీకాలు అందిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ వ్యాక్సిన్ అందుకున్న కొందరిలో మార్పులు రావడంతో చాలామంది వ్యాక్సిన్ టీకాను తీసుకోవడానికి ముందుకు రావట్లేదు.దీనిని ఉద్దేశించి పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తాజాగా వ్యాక్సినేషన్ డ్రైవ్ బ్రాండ్ అంబాసిడర్ గా సోనూసూద్ ను ఎన్నుకున్నారు.

Telugu Bollywood, Ambassador, Covid Program, Sonu Sood-Movie

గొప్ప పరోపకారి, యాక్టర్ సోనూసూద్ ని కరోన వ్యాక్సినేషన్ డ్రైవ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నారు అని చెప్పేందుకు చాలా సంతోషిస్తున్నాను అంటూ అమరీందర్ సింగ్ తెలిపాడు.ఆయన మద్దతు కి ధన్యవాదాలు అంటూ ప్రతి ఒక్క పంజాబీ కరోనా వ్యాక్సినేషన్ వేయించుకొని కరోనా నుంచి రక్షణ పొందాలంటూ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

ఈ వ్యాక్సిన్ వేయించుకోవడానికి పంజాబ్ ప్రజలు ఆసక్తి చూపటం లేదని, వారికి అవగాహన కల్పించడానికి సోనూసూద్ ను అంబాసిడర్ గా నియమించారట‌.ఇక సోనూసూద్ తనకు అందిన గౌరవం పట్ల అమరీందర్ సింగ్ కు ధన్యవాదాలు తెలిపాడు.

తన సొంత రాష్ట్ర ప్రజల ప్రాణాలు కాపాడుకునే విషయంలో తనకు హక్కు వచ్చినందుకు ఆనందంగా ఉందని తెలిపాడు సోనూ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube