దర్శకుడు ఆర్జీవీ తీసిన చెత్త సినిమాలు ఇవే..?

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ తొలినాళ్లలో ఎన్నో మంచి చిత్రాలను తెరకెక్కించడంతో పాటు దర్శకునిగా మంచి పేరును సంపాదించుకున్నారు.అయితే ఈ మధ్య కాలంలో ఆర్జీవీ దర్శకత్వం వహించిన సినిమాలేవీ బాక్సాఫీస్ దగ్గర హిట్ కాలేదు.

 Controversial Director Ram Gopal Varma Flop Movies List , Controversial Director-TeluguStop.com

ఆర్జీవీ డైరెక్షన్ లో వస్తున్న కొన్ని సినిమాలు ఆయనకు చెడ్డపేరు తెచ్చిపెట్టేలా ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.శివ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తీసిన వర్మ గత కొన్నేళ్లుగా ప్రేక్షకులకు తలనొప్పిని తెప్పించే సినిమాలను తీస్తున్నారు.

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చెత్త సినిమాలలో బాలీవుడ్ డార్లింగ్ సినిమా ఒకటి.ఫర్దీన్ ఖాన్, ఇషా డియోల్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.

మేరీ బేటీ సన్నీ లియోన్ బనా చాతీ హై పేరుతో ఆర్జీవీ సన్నీ లియోన్ లా పోర్న్ స్టార్ కావాలనుకుంటున్న యువతి కథను తెరకెక్కించగా ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర హిట్ కాలేదు.ఆర్జీవీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఐస్ క్రీమ్ సినిమాలో నవదీప్, తేజస్వి నటించగా ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర హిట్ కాలేదు.

Telugu Controversial, Darna Mana, Flop List, Cream, Meribeti, Ram Gopal Varma, R

రొటీన్ కథ, కథనంతో బోరింగ్ గా తెరకెక్కిన ఈ సినిమాకు కలెక్షన్లు ఎక్కువగా రాలేదు.హర్రర్ జోనర్ లో సినిమాలను ఎక్కువగా తెరకెక్కించిన రామ్ గోపాల్ వర్మ డర్నా మానా హై పేరుతో ఆరు చిన్న కథలతో సినిమాను తెరకెక్కించారు.ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కాకపోవడం గమనార్హం.ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటులు సైఫ్ అలీ ఖాన్, శిల్పాశెట్టి, వివేక్ ఒబరాయ్ ఇతర సినీ ప్రముఖులు నటించారు.

ఈ సినిమాలతో పాటు ఆర్జీవీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలలో కొన్ని సినిమాలు ఎప్పుడు రిలీజయ్యాయో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది.గతేడాది ఆర్జీవీ డైరెక్షన్ లో తెరకెక్కిన కొన్ని సినిమాలు ఓటీటీలు, ఏటీటీల్లో విడుదలయ్యాయి.

రామ్ గోపాల్ వర్మ మళ్లీ శివ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube