సాధారణంగా వయసు పెరిగే కొద్ది ఎముకలు(బోన్స్) బలహీన పడుతూ ఉంటాయి.అయితే ఇటీవల కాలంలో తక్కువ వయసుకే చాలా మందిలో ఎముకల బలహీన సమస్య కనిపిస్తోంది.
దీంతో తరచూ కీళ్ల నొప్పులు రావడం, నడుము నొప్పి రావడం, చిన్న చిన్న దెబ్బలకే ఎముకలు విరగడం వంటివి జరుగుతూ ఉంటాయి.అందుకే బోన్స్‌ను బలంగా ఉంచుకోవడం చాలా అవసరం.
అయితే కొన్ని కొన్ని ఆహారాలు ఎముకల ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పతాయి.అలాంటి వాటిలో బాదం పాలు ఒకటి.
బాదం పప్పు నుంచి తయారు చేసే ఈ బాదం పాలు అద్భుతమైన రుచి కలిగి ఉండటమే కాదు.పోషకాలు కూడా మెండుగా ఉంటాయి.ముఖ్యంగా ఎముకల ఆరోగ్యానికి, దృఢత్వానికి కాల్సిన కాల్షియం, విటమిన్- డి ఈ రెండూ బాదం పాలలో పుష్కలంగా ఉంటాయి.అందు వల్ల, ఎముకల బలహీనత సమస్యతో బాధ పడే వారు డైట్‌లో బాదం పాలు చేర్చుకుంటే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
కేవలం ఎముకలకే కాదు.కండరాలకు కూడా బాదం పాలు ఎంతో మేలు చేస్తాయి.బాదం పాలలో ఉండే విటమిన్ బి మరియు ప్రోటీన్ కండరాలను బలోపేతం చేసి.నొప్పులను నివారిస్తాయి.ఇక బాదం పాలు తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారన్న భయమే ఉండదు.ఎందుకంటే, బాదం పాలలో కెలరీలు చాలా తక్కువగా ఉంటాయి.
పైగా బాదం పాలు తీసుకుంటే.శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది.అలాగే రక్త హీనత సమస్యతో ఇబ్బంది పడే వారికి కూడా బాదం పాలు ఎంతగానో ఉపయోగపడతాయి.ప్రతి రోజు ఒక కప్పుడు బాదం పాలు తీసుకుంటే.
అందులో సమృద్ధిగా ఉండే ఐరన్ కంటెంట్ రక్త హీనత సమస్యను తగ్గు ముఖం పట్టేలా చేస్తుంది.ఇక బాదం పాలు తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే రిస్క్ కూడా తగ్గుతుంది.