ఏ క్రీడారంగంలో అయినా ఆటగాళ్లు ఎవరికి వారు వారి సత్తాను నిరూపించేందుకు ఎంతో కఠోరమైన శ్రమ పడుతూ.సాధన చేస్తూ ఉన్నా కానీ కొంత మంది విఫలమవుతూ ఉంటే.
మరికొందరు అద్భుతమైన విజయాలను దక్కించుకొని పతకాలను సొంతం చేసుకోవడంతో పాటు అభిమానుల మనుసులను కూడా దోచేస్తూ ఉంటారు.ఇది ఇలా ఉండగా తాజాగా ఇండియా స్టార్ రెజ్లర్ భజరంగ్ పునియా ఒకే ఒక్క దెబ్బకు స్వర్ణపతకం సొంతం చేసుకోవడంతో పాటు, ప్రపంచ ర్యాంకింగ్ లో నెంబర్ వన్ స్థానంగా నిలిచాడు.
దీనితో అతని అభిమానులు ఆనందంతో గంతులు వేస్తున్నారు.
తాజాగా ఇటలీ రాజధాని రూమ్ లో నిర్వహించిన మాటియో పెలికొన్ ర్యాంకింగ్ సిరీస్ 65 కేజీల విభాగం ఫైనల్ మ్యాచ్ లో మంగోలియాకు చెందిన తుల్గా తుమర్ ఒచిర్ తో గట్టిపోటీ ఇచ్చాడు.
మ్యాచ్ లో భాగంగా ముందుగా ఒచిర్ సరైన పట్లు పట్టి భజరంగ్ పై 2-0 ముందుకు తీసుకు వెళ్తున్న తరుణంలో మ్యాచ్ చివరి క్షణాల్లో బజరంగ్ ఒక్కసారిగా ప్రత్యర్ధి పై తన ఆధిపత్యాన్ని నిరూపిస్తూ, ప్రత్యర్థిపై డిఫెన్స్ ప్రదర్శిస్తూ 2 పాంయింట్స్ సొంతం చేసుకున్నాడు.దీనితో స్కోర్ 2-2 తో సమానం అయ్యింది.
వాస్తవానికి మ్యాచ్ నిబంధనల ప్రకారం చివరిలో ఎవరు పాయింట్లు సొంతం చేసుకుంటే వారిని విజేతలుగా ప్రకటిస్తూ ఉంటారు.దీంతో భారత స్టార్ రెజ్లర్ భజరంగ్ పునియా బరిలో విజయం సొంతం చేసుకొని స్వర్ణ పతకాన్ని చేసుకున్నాడు.ఈ టోర్నీలో భాగంగా వరల్డ్ రెండవ నెంబరు ఆటగాడిగా బరిలోకి దిగిన బజరంగ్, విజయం సాధించడంతో నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.ఇలా ఉండగా ఇప్పటికే వినేష్ ఫొగట్ స్వర్ణ పతకం, సరిత మోర్ రజత పతకం సొంతం చేసుకున్న సంగతి అందరికీ విధి తమే.ఈ క్రమంలో 70 కేజీల విభాగంలో విశాల్ కాళీ రమణ కాంస్య పతకం సొంతం చేసుకున్నారు.