ఇసుకను వేడి చేస్తే బంగారం వస్తుందా.. ??

మంత్రాలకు చింతకాయలను రాల్చవచ్చూ.మాయలు వస్తే రోగాలు కూడా తగ్గించవచ్చూ.

 Nagapur, Heating, Sand, Make Gold, Man Cheats,gold-TeluguStop.com

మోసం చేయడం వస్తే ఎవరినైనా ముంచేసి లక్షలు కొల్లగొట్టవచ్చని నిరూపించాడు ఓ వ్యక్తి.లోకంలో ఏదైనా ఒక విషయాన్ని గుడ్దిగా నమ్మేవారు ఉంటే వారికి మంచికంటే చెడు ఎక్కువగా జరుగుతుంది.

ఇకపోతే ఇసుకను వేడి చేస్తే బంగారం అవుతుందని ఓ కేటుగాడు నగల వ్యాపారిని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.మహారాష్ట్ర, పూణెలోని హదాస్ పూర్ కు చెందిన ఓ నగల వ్యాపారితో సన్నిహితంగా ఉంటున్న వ్యక్తి హఠాత్తుగా ఓ రోజు 4 కిలోల ఇసుక సంచిని తీసుకొచ్చి నగల వ్యాపారికి ఇచ్చాడట.

ఈ ఇసుక పశ్చిమ బెంగాల్ నుంచి తెప్పించిన ప్రత్యేకమైన ఇసుక దీన్ని వేడి చేస్తే బంగారం అవుతుందని నమ్మించాడట.

గొర్రె కసాయివాన్ని నమ్మినట్టుగా ఆ నగల వ్యాపారి నేరగాన్ని నమ్మి రూ.30 లక్షలు క్యాష్, రూ.20 లక్షల విలువైన బంగారం.మొత్తం 50లక్షలు అతనికి ముట్టజెప్పాడట.తర్వాత ఆ ఇసుకను వేడి చేసిన వ్యాపారికి బంగారం కాదు గానీ అంతకంటే ఇంకేదో కనిపించి ఉంటుంది.దాంతో తాను మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు.నిందితుడి కోసం గాలిస్తున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube