యుద్ధాలు, దండయాత్రలు, రక్తపాతంతో కొట్టుకుచస్తున్న ప్రపంచానికి సత్యాగ్రహం, అహింస అనే పదునైన ఆయుధాలను పరిచయం చేసిన మహానుభావుడు గాంధీజీ.వాటిని ఎలా ఆచరించాలో చూపించారు బాపూ.
చేత కర్రబట్టి బ్రిటీష్ వారిని తరిమి కొట్టినా, మగ్గం చేతబట్టి నూలు వడికినా, చీపురు అందుకొని మురికివాడలు శుభ్రం చేసినా.అదే ఒడుపూ, అంతే శ్రద్ధ.
ఒక్కడుగా మొదలై కోట్లాది మందిని ప్రభావితం చేసి.రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి మాతృదశ బానిస సంకెళ్లు తెంచారు మహాత్ముడు.20వ శతాబ్దంలో మానవాళిని అత్యంత ప్రభావితం చేసిన నాయకుల్లో ముందు వరసలో నిలుస్తారు మహాత్మా గాంధీ.భారత స్వాతంత్య్ర పోరాటాన్ని, గాంధీజీ జీవితాన్ని విడదీసి చూడలేం.
అంతటి మహానీయునికి భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్నారు.ఎందరో దేశాధినేతలు, ప్రముఖులు, శాస్త్రవేత్తలు ఆయనను అమితంగా ఆరాధిస్తారు.ఆయన చూపిన మార్గం, నేర్పిన విలువలు సదా ఆచరణీయం.పొరుబందరులో బాపు ఏ ఇంట్లో అయితే జన్మించాడో ఆ గృహాన్ని మందిరం మాదిరిగా ఉన్న మ్యూజియంగా నిర్మించారు.
ఈ ఆలయం పేరు కీర్తి మందిరం.దేశంలోని ప్రతి మూల నుంచి భక్తులు ఎప్పుడూ ఇక్కడికి వస్తూనే ఉంటారు.
తాజాగా గాంధీ పేరిట అమెరికా ప్రభుత్వం ఓ కొత్త చట్టం తీసుకొచ్చింది.శుక్రవారం అమెరికా ప్రతినిధుల సభ ‘గాంధీ-కింగ్ స్కాలర్లీ ఎక్ఛేంజ్ ఇనిషియేటివ్’ బిల్లును ఆమోదించింది.దీని ద్వారా అమెరికాకు చెందిన మేధావులు గాంధీపై అధ్యయనం చేయడానికి నిధులు సమకూర్చనుంది.అలాగే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ బోధనలపై భారతదేశానికి చెందిన మేధావులు అధ్యయనం చేయడానికి సహకారం అందించనుంది.
అంతేకాకుండా భారత్- అమెరికాలు కలిసి ఏటా ఇరు దేశాల్లోని మేధావుల కోసం సదస్సులు నిర్వహించడానికి ఈ చట్టం వీలు కల్పిస్తుంది.గాంధీ-కింగ్ స్కాలర్లీ ఎక్ఛేంజ్ ఇనిషియేటివ్ చట్టం కింద ప్రతి ఆర్థిక సంవత్సరానికి మిలియన్ డాలర్లు చొప్పున 2025 వరకూ అమెరికా ప్రభుత్వం నిధులు అందించనుంది.దీంతో పాటు గాంధీ-కింగ్ గ్లోబల్ అకాడెమీకి 2021 ఆర్థిక సంవత్సరంలో 2 మిలియన్ డాలర్లు, అదే ఏడాది యూఎస్-ఇండియా.
గాంధీ-కింగ్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్
కు 30 మిలియన్ డాలర్లు అందించనుంది