కూరగాయల్లో రారాజు అని తెలుగులో, కింగ్ ఆఫ్ వెజిటబుల్స్ అని ఇంగ్లీష్‌లో పిలుచుకునే వంకాయ తెలియని వారుండరు.ప్రపంచవ్యాప్తంగా విరి విరిగా ఉపయోగించే కూరగాయల్లో వంకాయ కూడా ఒకటి.
ఈ వంకాయతో తయారు చేసిన వంటలు చిన్నా, పెద్ద తేడా లేకుండా చాలా మంది ఇష్టంగా తింటుంటారు.ఎందుకంటే, వంకాయ అంత రుచిగా ఉంటుంది కాబట్టి.
రుచిలోనే కాదు.బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు అందించడంలోనూ వంకాయ ముందుటుంది.
అయితే చలి కాలంలో వంకాయను తీసుకోవచ్చా అన్న ప్రశ్న చాలా మంది మదిలో ఉంది.అయితే చలి కాలం అంటేనే రకరకాల రోగాలకు, అలర్జీలకు కేరాఫ్ అడ్రస్.
ముఖ్యంగా ఈ సీజన్‌లో చాలా మంది అలర్జీల సమస్యలను ఎదుర్కొంటారు.అలాంటి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ వంకాయ తినకూడదు.
అలాగే ఏవైనా వైరల్ జ్వరాలు ఉన్నా వంకాయ తినకపోవడమే మంచిది.ఎందుకంటే, వంకాయ తింటే అలర్జీలు మరియు వైరల్ జ్వరాలు మరింత ఎక్కువ అవుతాయి.
ఇక ఎలాంటి సమస్యలు లేని వారు వింటర్ సీజన్‌లో నిర్భయంగా వంకాయ తినొచ్చు.వంకాయ తీసుకోవడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది.ఫలితంగా గుండె పోటు, ఇతర గుండె సంబంధిత సమస్యలకు దూరంగా ఉండొచ్చు.అలాగే వంకాయలో విటమిన్ సి కూడా ఉంటుంది.ఇది శరీర రోగ నిరోధక వ్యవస్థను బలపడేందుకు సహాయపడుతుంది.
ఫైబర్ పుష్కలంగా ఉండే వంకాయ తినడం వల్ల శరీరంలో అదనంగా ఉండే కేలరీలు కరిగించి.అధిక బరువు సమస్యను దూరం చేస్తుంది.
ఇక మినరల్స్, విటమిన్లు పుష్కలంగా ఉండే వంకాయ తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ సమస్య కూడా తగ్గుముఖం పట్టడమే కాకుండా.శిరోజాలకు బలాన్ని చేకూర్చుతుంది.
అలాగే వంకాయ తినడం వల్ల మరో ప్రయోజనం ఏంటంటే.కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.