ఐ ఫోన్ కోసం కిడ్నీ అమ్మేశాడు.. కానీ అంతలోనే

ఐ ఫోన్ అనేది సామాన్యుడికి ఏ మాత్రం అందుబాటులో లేని సెల్ ఫోన్.లక్షల రూపాయిల విలువ చేసే ఐ ఫోన్ వాడాలంటే మన స్థాయి కూడా అదే రేంజ్ అయ్యి ఉండాలి.

 Chinese Man Who Sold Kidney To Buy Iphone Now Bedridden For Life, China, Apple I-TeluguStop.com

ఉన్నత కుటుంబాలలో ఐ ఫోన్ అనేది ఒక గాడ్జెట్ మాత్రమే.అది తమ హోదాని చూపించుకునే ఒక వస్తువు.

అయితే సామాన్య, మధ్యతరగతి ప్రజలకి మాత్రం ఐ ఫోన్ ఒక కల.చాలా మందికి ఐ ఫోన్ వాడాలనే కల ఉంటుంది.అయితే లక్షల రూపాయిలు ఖర్చు పెట్టి దానిని కొనుక్కునే స్తోమత లేక సైలెంట్ అయిపోతారు.అయితే అలాగే చైనాలో ఓ వ్యక్తికి ఐ ఫోన్ వాడాలనే కల ఉంది.

దానికి అతని ఆర్ధిక పరిస్థితి సహకరించకపోవడం ఏకంగా కిడ్నీని బ్లాక్ మార్కెట్లో అమ్మేసి వచ్చిన డబ్బుతో ఐ ఫోన్ కొన్నాడు.ఇంత వరకు బాగానే ఉన్న అక్కడే అసలు కథ మొదలైంది.

Telugu Apple Phone, Bedridden, China, Chinaboy, Chinese, Chinesesold, Dreams-Lat

ఓకే కిడ్నీతో ఉన్న అతను కొంత కాలం తర్వాత అస్వస్థతకి గురి కావడంతో టెస్ట్ లు చేసి చూడగా అతనికి ఉన్న ఒక్క కిడ్నీ పూర్తిగా పాడైపోయింది.దీంతో ప్రతిరోజు డయాలసిస్ చేసుకుంటే కానీ బ్రతకలేని పరిస్థితి. ఐ ఫోన్ కోసం ఆశపడిన అతను ఇప్పుడు పూర్తిగా మంచానికి పరిమితం అయ్యాడు. ఐ ఫోన్ వాడాలనే సంతోషం చివరికి అతని ప్రాణాల మీదకి తీసుకొచ్చింది.

ఈ ఘటన చైనాలో జరగగా కిడ్నీ అమ్మేసి ఐ ఫోన్ కొన్న వాంగ్ షాంగ్‌క‌న్‌ ఇప్పుడు ఎప్పుడు పోతాయో తెలియని ప్రాణాలతో చివరి ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు.కాగా బ్లాక్ మార్కెట్‌లో కిడ్నీ కొనుగోలు చేసిన‌ విష‌యంలో ఐదుగురు స‌ర్జ‌న్ల‌తో క‌లిపి తొమ్మిది మందిని పోలీసులు క‌ట‌క‌టాల వెన‌క్కు నెట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube