టాలీవుడ్ బిగ్గె్స్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటేందుకు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.
దీంతో ఆర్ఆర్ఆర్ ఎలాంటి విధ్వంసాన్ని సృష్టిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.అయితే ఈ సినిమా షూటింగ్ అనుకున్న దానికంటే మరింత ఆలస్యం అవుతుండటంతో ప్రేక్షకులు ఒకింత ఆందోళనకు గురవుతున్నారు.
కాగా ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కరోనా కారణంగా వాయిదా పడుతూ చాలా ఆలస్యం అయిన సంగతి తెలిసిందే.దీంతో ఈ సినిమా షూటింగ్‌ను ఇటీవల ప్రారంభించారు చిత్ర యూనిట్.
కాగా ఈ సినిమా షూటింగ్లో తారక్, చరణ్‌లకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడట జక్కన్న.అయితే ఈ షూటింగ్లో తెరకెక్కుతున్న సీక్వెన్స్ పూర్తిగా ఇంటర్వెల్ బ్యాంగ్‌కు సంబంధించినట్లుగా తెలుస్తోంది.
ఈ సీక్వెన్సులో ఇద్దరు హీరోలు కూడా చేసే యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.
మొత్తానికి కరోనా కారణంగా వాయిదా పడ్డ ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్‌ను తిరిగి ప్రారంభించిన జక్కన్న, ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటుండగా ఈ సినిమాలో కీలకమైన ఇంటర్వెల్ బ్యాంగ్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాతో జక్కన్న ఎలాంటి విధ్వంసాన్ని సృష్టిస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్, బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, ఫారిన్ బ్యూటీ ఒలివియా మారిస్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.డివివి దానయ్య అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.