మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న కొత్త హీరో వైష్ణవ్ తేజ్ నటించిన తొలి చిత్రం ‘ఉప్పెన’ ఎప్పుడో షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.కాగా ఈ సినిమాను తొలుత వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.
కానీ కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడటంతో ఈ సినిమా ఎప్పుడెప్పడు రిలీజ్ అవుతుందా అనే ఆసక్తి చిత్ర వర్గాల్లో నెలకొంది.ఇక ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ పర్ఫార్మెన్స్ పీక్స్‌లో ఉండనుందని చిత్ర యూనిట్ మొదట్నుండీ చెబుతూ వస్తోంది.
ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే వైష్ణవ్ తేజ్ తన రెండో చిత్రాన్ని ఇప్పటికే ప్రారంభించాడు.ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
కాగా పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రానుండటంతో ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్ ఎలాంటి హిట్ కొడతాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.అయితే వైష్ణవ్ తేజ్‌కు ప్రస్తుతం సినిమా ఆఫర్లు వెల్లువలా వచ్చి పడుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే క్రిష్ లాంటి స్టార్ డైరెక్టర్‌తో సినిమా చేస్తున్న వైష్ణవ్ తేజ్‌కు మరో రెండు టాప్ బ్యానర్లు సినిమా చేయాల్సిందిగా ఆఫర్ ఇచ్చాయట.దీంతో వైష్ణవ్ తేజ్ సదరు బ్యానర్లు చెప్పే కథలను బట్టి వాటిని ఓకే చేస్తాడా లేడా అనేది తేలాల్సి ఉంది.
ఇక ఆయన నటించిన ఉప్పెన చిత్రాన్ని ఎలాగైనా థియేటర్లలోనే రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ కసరత్తు చేస్తోంది.ఈ క్రమంలో ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తే వైష్ణవ్ తేజ్ లాంఛ్ గ్రాండ్‌గా ఉంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.
ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోండగా విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటిస్తున్నాడు.