సుధీర్ బాబు శ్రీదేవిగా పలాస హీరోయిన్ ఫిక్స్

పలాస 1978 సినిమాతో దర్శకుడుగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన టాలెంటెడ్ రైటర్ కరుణకుమార్.కులాల మధ్య ఆధిపత్య పోరుకి ప్రేమకథకి లింక్ చేసి తెరపై ఆవిష్కరించిన విధానం ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యింది.

 Sudheer Babu New Movie Heroine Fixed, Tollywood, Telugu Cinema, Sridevi Soda Cen-TeluguStop.com

అయితే లాక్ డౌన్ కి కొద్ది రోజుల ముందు ఈ సినిమా రిలీజ్ కావడంతో ఎక్కువ మంది ప్రేక్షకులకి రీచ్ కాలేదు.అయితే కరుణ కుమార్ టాలెంట్ కి మాత్రం టాలీవుడ్ హీరోలు బాగానే కనెక్ట్ అయ్యారు.

ఈ నేపధ్యంలో రెండో సినిమాని సుధీర్ బాబుతో చేసే అవకాశం కరుణ కుమార్ సొంతం చేసుకున్నాడు.ఈ సినిమాకి కూడా తనకి బాగా కనెక్ట్ అయ్యే విలేజ్ నేపధ్యం దర్శకుడు కరుణ తీసుకున్నాడు.

అది కూడా పీరియాడిక్ టచ్ లోనే తెరపై ఆవిష్కరించడానికి రెడీ అవుతున్నాడు.శ్రీదేవి సోడా సెంటర్ టైటిల్ తో సుధీర్ బాబుతో కొత్త సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ని తాజాగా రిలీజ్ చేసి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చేశారు.

ఇదిలా ఉంటే టైటిల్ బట్టి ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో గ్రామీణ ప్రాంతాలలో జరిగే జాతర పాయింట్ అఫ్ వ్యూలో ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది.పోస్టర్ లో సుధీర్ బాబు లుక్ బట్టి విలేజ్ లో పెళ్లిళ్లకి డెకరేషన్ చేసే యువకుడుగా ఉండబోతుంది అని తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ శ్రీదేవిగా కరుణ కుమార్ మరల తన పలాస భామని ఫైనల్ చేశాడని తెలుస్తుంది.పలాస సినిమాలో నటించిన శ్రీ‌దేవిగా ఎవరు కనిపిస్తున్నారు అనే ప్రశ్న అందరిలోనూ ఉంది.

నిజానికి ఈ పాత్ర కోసం కొత్త హీరోయిన్ ను అనుకున్నారట.కానీ ఫైనల్ గా పలాస హీరోయిన్ న‌క్ష‌త్రనే ఫైనల్ చేసారని సమాచారం‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube