ఆర్15 బైక్ మీద ఆంటీ రయ్ రయ్ మంటూ స్పీడ్ గా...

దేశం అభివృద్ధి చెందుతుండడంతో మహిళలకు అన్ని విషయాలలోనూ అవగాహన బాగానే పెరుగుతోంది.ఇందులో భాగంగా వారు కూడా అన్ని రంగాల్లోనూ బాగానే రాణిస్తున్నారు.

 Yamaha R15, married Woman, married Woman Riding Yamaha R15 Bike Video Viral ,-TeluguStop.com

ఇంతకు ముందయితే ద్విచక్ర వాహనాలాలోని మహిళలు స్కూటర్లను మాత్రమే నడిపేవారు.  కానీ ఈ మధ్యకాలంలో కొందరు మోటార్ సైకిల్స్ ని కూడా చాలా  సునాయాసంగా నడిపిస్తున్నారు.

తాజాగా ఓ వివాహిత ప్రముఖ స్పోర్ట్స్ బైక్ కంపెనీ అయిన యమహా మోడల్ అయినటువంటి యమహా ఆర్15  బైక్ ని సునాయాసంగా రోడ్డుపై నడుపుతూ కనిపించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ చక్కెర్లు కొడుతుంది.

వివరాల్లోకి వెళితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా మాధ్యమాలు అందరికీ అందుబాటులోకి రావడంతో కొందరు ఏదైనా డిఫరెంట్ గా కనిపిస్తే చాలు వెంటనే తమ తరవాణిలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

 అయితే తాజాగా ఓ వివాహిత తన తల్లి మరియు కూతుర్ని యమహా ఆర్15 బైక్ మీద కూర్చోబెట్టుకొని నడుపుతూ రోడ్డు పై కనిపించింది.దీంతో స్థానికులు ఇది గమనించి ఈ దృశ్యాన్ని తమ చరవాణిలో వీడియో తీసి షేర్ చేశారు.

 ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

దీంతో కొందరు “మహిళలకు సరైన శిక్షణ ఇవ్వాలి కానీ వారు ఎలాంటి వాహనాన్నైనా సునాయాసంగా నడిపిస్తారని” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరి కొంతమందయితే ఏకంగా “పాలిచ్చి పెంచిన తల్లులు సార్… వీరికి మోటార్ సైకిల్ నడపడం పెద్ద లెక్క ఏమీ” కాదంటూ అరవింద సమేత చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ చెప్పేటువంటి డైలాగు ని వళ్లిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube