మొన్నటి వరకు “యూట్యూబ్ స్టార్ గంగవ్వ” అంటే దాదాపుగా తెలియని వారుండరు. అయితే గంగవ్వ తన నటనతో యూట్యూబ్ లో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ ఏకంగా తెలుగు బిగ్ బాస్ 4వ సీజన్లో కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం దక్కించుకుని ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.
అయితే గత వారం జరిగినటువంటి ఎలిమినేషన్స్ లో గంగవ్వని ఆమె ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా షో నిర్వాహకులు ఆమెను ఎలిమినేట్ చేశారు. అయితే ఈ బిగ్ బాస్ షోలో పాల్గొన్నందుకు దాదాపుగా కోటి రూపాయలకు పైగా పారితోషకాన్ని గంగవ్వకి షో నిర్వాహకులు ముట్టజెప్పినట్లు పలు వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.
అయితే తాజాగా గంగవ్వకి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.అయితే ఆ ఫోటో ని ఒకసారి పరిశీలించినట్లయితే ప్రస్తుత గంగవ్వ ఫోటోని తీసుకుని కొంతమంది అభిమానులు ఫేస్ యాప్ ను ఉపయోగించి చిన్నప్పటి గంగవ్వ ఫోటోగా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
దీంతో గంగవ్వ చిన్నప్పటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది.అంతేగాక ఈ ఫోటోని షేర్ చేసిన అతి కొద్ది కాలంలోనే దాదాపుగా పది లక్షల పైచిలుకు లైకులు, కామెంట్లు వచ్చాయి.
దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నెట్టింట్లో యూట్యూబ్ సార్ గంగవ్వ కి ఉన్నటువంటి క్రేజ్ ఏమిటో అని.
అయితే ఈ విషయం ఇలా ఉండగా క్రేజ్ కి మరియు వయసుకి ఏమాత్రం సంబంధం లేదంటూ యూట్యూబ్ స్టార్ గంగవ్వ నిరూపించింది. దాదాపుగా 60 ఏళ్ళ వయసులో తన నటనతో మెప్పించి తనకంటూ కొంత మంది అభిమానులను సంపాదించుకుంది. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కున్నటువంటి గంగవ్వ ప్రస్తుతం యూట్యూబ్ స్టార్ గా వెలుగొందుతోంది.
అంతేగాక ఇప్పటికీ ఆమె వీడియోని యూట్యూబ్ లో షేర్ చేసిన ఒక్కరోజులోనే దాదాపుగా పది లక్షల పైచిలుకు న్యూస్ వస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు గంగవ్వ తన నటనతో ప్రేక్షకులను ఎంతగా కట్టిపడేసిందోనని.