ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020లో భాగంగా ఈ రోజు షార్జా వేదికగా రసవత్తరమైన పోరు జరుగుతోంది.విరాట్ కోహ్లీ సారధ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కె ఎల్ రాహుల్ సారథ్యంలోనే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో పోటీపడుతోంది.
ఇప్పటివరకూ బెంగళూరు ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, పంజాబ్ కేవలం ఒక్క మ్యాచ్ లోనే గెలుపొందింది.ఇక ఈ టోర్నీలో నిలవాలంటే.
పంజాబ్ ఇప్పటి నుంచి దాదాపుగా ఆడే ప్రతి మ్యాచ్ ల్లోనూ విజయం సాధించాలి.ఈ మ్యాచ్‌లో బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని 171 పరుగుల స్కోరు చేసింది.
మ్యాచ్ లో బెంగళూరు జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టి, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది.బెంగళూరు బ్యాట్స్ మెన్ల లో కెప్టెన్ కోహ్లి, క్రిస్ మోరిస్ లు రాణించారు.
విరాట్ కోహ్లీ 39 బంతులు ఆడి 3 ఫోర్లతో 48 పరుగులు చేయగా, మోరిస్ 8 బంతుల్లోనే 1 ఫోర్, 3 సిక్సర్ల తో 25 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.ఒకే ఓవర్లో డివిలియర్స్, కోహ్లిల వికెట్లను కోల్పోవడంతో 150 లోపే ఇన్నింగ్స్‌ను ముగిస్తుందని అనుకున్న సమయంలో మోరిస్ చెలరేగడంతో బెంగళూరు ఆ స్కోరు చేయగలిగింది.
పంజాబ్ బౌలర్లలో మహమ్మద్ షమీ, ఎం అశ్విన్‌లు చెరో 2 వికెట్లు తీశారు.అర్షదీప్ సింగ్, క్రిస్ జోర్డాన్‌లు చెరొక వికెట్ తీశారు.
అయితే , ఆ వికెట్ పై ఇది కాపాడుకోగలం స్క్రోర్ కావడంతో మ్యాచ్ పై ఆసక్తి పెరిగిపోతుంది.అయితే , పంజాబ్ తరపున ఈ సీజన్ లో మొదటిసారి యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ బరిలోకి దిగబోతున్నాడు.
ఒక్కసారి గేల్ కుదురుకుంటే మాత్రం బెంగుళూరు బౌలర్లకు చుక్కలే.