టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేసిన సురేఖవాణి, ఆవిడ కూతురు సుప్రీత సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తున్న వీడియో లు చాలానే చూశాం.టాలీవుడ్ ఇండస్ట్రీలో సురేఖవాణి ఎంత పాపులరో సోషల్ మీడియాలో కూడా కూతురు సుప్రీత కూడా బాగానే పాపులర్ పొందింది.
తల్లి కూతుర్లు కలిసి ఎక్కడికైనా వెకేషన్స్ కు వెళ్ళినప్పుడు, ఇద్దరు కలిసి బాగా డాన్స్ లు వేయడం లాంటి వీడియోలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడంతో వారిద్దరు బాగా ఫేమస్ అయ్యారు.ఇక వీరిద్దరిని పక్కన నిలబడితే తల్లి కూతురు అని ఎవరు కూడా భావించరు.
ఇద్దరు అక్కాచెల్లెళ్లు అన్నట్లుగానే అనుకుంటారు.కూతురుతో పోటీపడి మరీ మోడరన్ డ్రెస్సులు వేసుకొని సురేఖవాణి తన కూతురితో పోటీపడుతోంది.
అసలు విషయంలోకి వెళితే… తాజాగా
సురేఖ కూతురు సుప్రీత
ఓ అదిరిపోయే ఫోటోను షేర్ చేసి అందులో తన తల్లి పై ఉన్న ప్రేమను తెలియజేస్తూ పోస్ట్ చేసింది.తన తల్లి పై ఉన్న ప్రేమను తెలుపుతూ ఓ కామెంట్ చేసింది.
అందులో ‘ నీ చివరి శ్వాస వరకు నాకు సంతోషం నీ వల్లే అంటూ’ తెలిపింది సుప్రీత.అయితే ఇందుకు సంబంధించి మ్యాటర్ ను ఇంగ్లీష్ లో తెలపగా అందులో breath (శ్వాస) అనే పదాన్ని breadth గా రాయడంతో సుప్రీతను నెటిజన్లు ఆడుకున్నారు.
అంత చిన్న స్పెల్లింగ్ కూడా తెలియదా అంటూ ఆమెపై ట్రోల్ చేశారు నెటిజెన్స్.దీంతో అలర్ట్ అయిన ఆవిడ తన పోస్ట్ ను ఎడిట్ చేసింది.
ఆ తర్వాత తనను ట్రోల్ చేసిన నెటిజన్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది సుప్రీత.” అందురూ రెడీగా ఉంటారు కదా ఎవరు ఏం తప్పు చేస్తారో.కామెంట్లో వారిని వేసుకుందాం అని, మీరు ఏంటి ఇంగ్లీష్ లో ఏమైనా పీహెచ్డీ చేశారా .? లేకపోతే ఆక్స్ఫర్డ్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారా…? పెద్ద దండం రా మీకు, కొంచెం లైఫ్ లో ఏదో ఒకటి చేయండి రా బాబు… మా మీద పడి పోవడం కాకుండా.అసలు నేను నచ్చలేదంటే ఇంకా ఫాలో అవ్వడం ఎందుకు.? నన్ను చూడనీక…? ఏం తప్పు చేస్తుందో వెతుకుదాం అని కదా, చేంజ్ అవ్వండి రా కొంచెం” అంటూ సుప్రీత నెటిజన్స్ పై విరుచుకుపడింది.పాపం సుప్రీత నెటిజన్స్ చేసిన కామెంట్స్ కి బాగా హర్ట్ అయినట్లుంది.ఈ మధ్య కాలంలో కాస్త టాలీవుడ్ ఇండస్ట్రీలో సురేఖ వాణి చేసే సినిమాలు కాస్త తగ్గాయని చెప్పవచ్చు.