రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తోందెవ‌రు.. బీజేపీకి వైసీపీ ఘాటు కౌంట‌ర్‌..!

రాష్ట్రంలోని జ‌గ‌న్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న అనేక కార్య‌క్ర‌మాల కోసం.స‌ర్కారీ త‌ర‌ఫున అప్పులు చేయాల్సి వ‌స్తోంది.

 Who Dragged State To Debts Ycp Counter To Bjp, Ysrcp, Bjp, Andhra, Andhra Prades-TeluguStop.com

ఈ క్ర‌మంలో కొంత మేర‌కు ఎక్కువే అప్పులు చేస్తున్న విష‌యం వాస్త‌వ‌మే.అయితే, దీనికి కేవ‌లం సంక్షేమ కార్య‌క్ర‌మాలే కార‌ణ‌మా?  జ‌గ‌న్ వైఖ‌రితోనే రాష్ట్రం అప్పుల పాల‌వుతోందా? అంటే.బీజేపీ నేత‌లు అదే మాట అంటున్నారు.బీజేపీ జాతీయ కార్య‌ద‌ర్శి స‌త్య‌కుమార్‌.తాజాగా రాష్ట్ర ప్ర‌భుత్వ వైఖ‌రిపై నిప్పులు చెరిగారు.జ‌గ‌న్ పాల‌న‌తో రాష్ట్రం అప్పుల పాల‌వుతోంద‌న్నారు.

జ‌గ‌న్‌కు పాల‌న చేత‌కావ‌డం లేద‌న్నారు.

అయితే, ఈ అప్పుల విష‌యాన్ని కొంచెం లోతుగా ప‌రిశీలిస్తే.

ఆశ్చ‌ర్య‌క‌ర విష‌యం క‌నిపిస్తుంది.రాష్ట్రం చేస్తున్న అప్పుల వెనుక కేంద్రం పాత్రే బోలెడు ఉంద‌నేది వాస్త‌వం అంటున్నారు వైసీపీ నాయ‌కులు.

రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాక‌పోవ‌డం వ‌ల్లే.ప్ర‌బుత్వం అప్పులు చేయాల్సి వ‌స్తోంద‌న్న వారి వ్యాఖ్య‌లు నిజమ‌నే పేర్కొనాలి.

ఏపీ విష‌యానికి వస్తే.విభ‌జ‌న హామీల్లో స‌గం కూడా పూర్తి కాలేదు.

పోల‌వ‌రానికి ఇవ్వాల్సిన 5 వేల కోట్లు.అంటే రాష్ట్రం ఖ‌ర్చె పెట్టింది కూడా తిరిగి ఇవ్వ‌లేదు.

ఇక‌, జీఎస్టీ బ‌కాయిల చెల్లింపులోనూ కేంద్రం మొండి వైఖ‌రి అవ‌లంబిస్తోంది.

Telugu Andhra, Bjp, Central, Debts, Funds, Status, Ys Jagan-Telugu Political New

ఈ ప‌రిణామాల‌కు తోడు.సంక్షేమ ప‌థ‌కాలు కూడా రాష్ట్రానికి ఒకింత భార‌మ‌య్యాయ‌నేది వాస్త‌వం.అయితే, కేంద్రం ఇవ్వాల్సిన నిధులు ఇచ్చి ఉంటే.

రాష్ట్రం అప్పుల పాలు కావాల్సిన అగ‌త్యం ఏముంటుంద‌న్న వైసీపీ నేత‌ల‌కు బీజేపీ నాయ‌కులు స‌మాధానం చెప్ప‌గ‌ల‌రా? అదేస‌మ‌యంలో రాష్ట్రం కోరుతున్న ప్ర‌త్యేక హోదా ఇచ్చేందుకు ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉందా?  గ‌త ప్ర‌బుత్వం చేసిన అప్పుల విష‌యంలో మౌనం పాటించ‌డ‌మే కాకుండా.ప్ర‌స్తుత ప్ర‌భుత్వ‌మే.

ఏదో అప్పులు చేస్తున్న వ్యాఖ్య‌లు చేస్తున్న బీజేపీ నేత‌ల ద్వంద్వ వైఖ‌రిని ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌న్న వైసీపీ నేత‌ల వ్యాఖ్య‌ల‌కు స‌మాధానం చెప్పేవారేరీ.! మ‌రి స‌త్య‌కుమార్ ఏమంటారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube