డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అన్ని కూడా ఇప్పుడు సినిమాలపై దృష్టి పెట్టాయి హిందీతో పాటు సౌత్ లో ఇప్పటికీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సినిమాలపై ఫోకస్ పెట్టాయి.నిర్మాతలతో సంప్రదింపులు జరుపుతూ వారికి మంచి రేటు ఆఫర్ చేస్తూ రిలీజ్ రైట్స్ సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
అయితే కొంత మంది దర్శక నిర్మాతలు ఓటీటీపై ఆసక్తి చూపిస్తూ ఉంటే మరికొంత మంది మాత్రం తమ సినిమాలని థియేటర్ లోనే రిలీజ్ చేస్తామని నొక్కి వక్కాణిస్తున్నారు.ఓటీటీ రిలీజ్ కి ససేమీరా అంటున్నారు.
అయితే ఓటీటీ పుణ్యమా అని రిలీజ్ కాకుండా ఆగిపోయిన సినిమాలకి కూడా మోక్షం వస్తుంది.ఓటీటీ సంస్థలు ఇచ్చే డబ్బులకి ఎంతో కొంత వస్తుందని సంతృప్తి పడి తమ సినిమాలని అమ్మేస్తున్నారు.
ఇప్పుడు అదే దారిలో గోపీచంద్ ఆరడుగుల బుల్లెట్ సినిమా కూడా వెళ్తుంది.
ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.
సీనియర్ డైరెక్టర్ బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని జయ బాలాజీ రియల్ మీడియా బ్యానర్ పై తాండ్ర రమేష్ నిర్మించారు.వక్కంతం వంశీ స్టోరీ, స్క్రీన్ ప్లే అందించాడు.స్టార్ హీరోయిన్ నయనతార గోపీచంద్ కు జోడీగా నటించింది.సుమారు మూడేళ్ళ క్రితమే షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా రిలీజ్ కి నోచుకోలేదు.అయితే మధ్యలో చాలాసార్లు రిలీజ్ చేయాలని అనుకోని డేట్స్ ప్రకటించి మళ్ళీ ఆగిపోయేవారు.
ఇప్పుడు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ పుణ్యమా అని ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తోంది.ఓ ప్రముఖ ఓటీటీ ఛానల్ ఈ సినిమా రిలీజ్ రైట్స్ కోసం ఎనిమిది కోట్లు నిర్మాతకి ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది.
దీంతో ఎంతో కొంత వస్తుందని భావించి నిర్మాత రిలీజ్ రైట్స్ అమ్మేసినట్లు సమాచారం.త్వరలో దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన వస్తుందని తెలుస్తుంది.