తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు తన సెంటిమెంటల్ చిత్రాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న హీరో సిద్ధార్థ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే హీరో సిద్ధార్థ కి అటు తమిళంలోనూ ఇటు తెలుగు లోనూ మంచి మార్కెట్ ఉంది.
కానీ ఈ మధ్య కాలంలో హీరో సిద్ధార్థ తన చిత్రాలతో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నాడు.అయితే ఇందుకు ముఖ్య కారణంగా తన చిత్ర కథల విషయంలో సిద్ధార్థ సరైన నిర్ణయం తీసుకోక పోవడమేనని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే తాజాగా హీరో సిద్ధార్థ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వార్త ఏంటంటే ప్రస్తుతం సిద్ధార్థ ఓ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.
అయితే ఈ చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించేందుకు గాను టాలీవుడ్ బ్యూటిఫుల్ క్వీన్ సమంత అక్కినేని ని సంప్రదించగా ఆమె నిర్మొహమాటంగా నో చెప్పినట్లు పలు వార్తలు నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తున్నాయి.అంతేగాక ఈ చిత్రంలో సమంత అక్కినేని పాత్రలో వరల్డ్ ఫేమస్ లవర్ చిత్ర ఫేమ్ ఐశ్వర్య రాజేష్ ని రీప్లేస్ చేసినట్లు సమాచారం.
అయితే గతంలో సిద్ధార్థ మరియు అక్కినేని సమంత గాఢంగా ప్రేమించుకున్నారని కానీ పలు అనివార్య కారణాల వల్ల వీరిద్దరూ పెళ్లి చేసుకోలేక పోయారని అప్పట్లో పలు వార్తలు బలంగా వినిపించాయి.అందువల్లే సమంత అక్కినేని ప్రస్తుతం హీరో సిద్ధార్థ చిత్రంలో నటించడానికి అంగీకరించలేదని కూడా వాదన వినిపిస్తోంది.
వీరిద్దరి గురించి వినిపిస్తున్నటువంటి ఈ విషయంపై ఇప్పటి వరకు ఇటు హీరో సిద్ధార్థ గాని లేదా సమంత అక్కినేని గాని స్పందించలేదు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సమంత అక్కినేని టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.