జగన్ మంత్రి మండలి ని చూస్తే ముచ్చటేస్తుంది.కోరి మరీ జగన్ తన క్యాబినెట్ లో కూర్పు చేశారు.
ఎప్పుడూ లేని విధంగా సామాజిక వర్గాల సమతూకం పాటించారు.ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకుని ఉన్న నాయకులకు సైతం జగన్ అన్యాయం చేశారు.
తన క్యాబినెట్ లో అన్ని కులాలకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచనతో జగన్ అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని, మంత్రి మండలి ఏర్పాటు చేశారు.వీరిలో చాలామంది కొత్తగా ఎన్నికైన వారే.
పాలనా అనుభవం లేకపోయినా, జగన్ వారి పై నమ్మకంతో మంత్రి పదవులు కట్టబెట్టి తగిన ప్రాధాన్యం ఇచ్చారు.అయితే కొంతకాలంగా కొంతమంది మంత్రుల వ్యవహారశైలిపై జగన్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
కీలక అంశాల గురించి మంత్రులతో జగన్ చర్చించినా, అనేక కీలక అంశాలకు సంబంధించి తమ రాజకీయ ప్రత్యర్థులుగా పిలుచుకుంటూ వస్తున్న టిడిపి అనుకూల మీడియాకు లీకులు ఇవ్వడం, జగన్ తీసుకున్న నిర్ణయం ఇంకా పూర్తిస్థాయిలో అమల్లోకి రాకుండానే, జనాల్లోకి వెళ్ళి పోతూ ఉండటం, దీనిపై తీవ్ర స్థాయిలో వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేయడం ఇలా ఎన్నో చోటు చేసుకున్నాయి.అయినా చాలా కాలంగా జగన్ మౌనంగానే ఉంటూ వస్తున్నారు.
కానీ ఈ మధ్య కొన్ని కీలక నిర్ణయాలకు సంబంధించి కేవలం మంత్రివర్గ సహచరులకు మాత్రమే చెప్పినా, విషయాలు అమల్లోకి రాకముందే, వైసిపి వ్యతిరేక మీడియాకు లీకులు ఇవ్వడం, వారు నానా హడావుడి చేస్తూ ఉండటం వంటి పరిణామాలతో జగన్ కొంతకాలంగా ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అసలే జగన్ తాను ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ అంశమైనా ముందుగా మంత్రులకు చెప్పరు.
అత్యవసరమైతే ఆ విషయాలు చెబుతూ ఉంటారు.తను ఏం చేయాలనుకున్నానో అది ఎవరూ ఊహించని విధంగా అమలు చేస్తూ ఉంటారు.
కానీ సొంత పార్టీలోని మంత్రులు కీలక నిర్ణయాలకు సంబంధించిన విషయాలు మీడియాకు లీక్ చేస్తున్నారని జగన్ ఎప్పటి నుంచో అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పుడు ఈ లీకుల వ్యవహారాలపై జగన్ సీరియస్ గా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
ఇకపై ఎవరైనా మంత్రులు మీడియాకు మొహమాటంతో ఇంటర్వ్యూ ఇచ్చినా, ఎక్కడా వివాదాస్పదంగా మాట్లాడవద్దని పదేపదే చెబుతున్నారు.
అయితే మంత్రులు కొంతమందికి జగన్ తీరుపై ఆగ్రహం ఉండడమో, మరో కారణమో తెలియదు కానీ జగన్ తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే ఆగ్రహంతో ఉన్నారు.
ఈ తరుణంలో ఇప్పుడు తాను తీసుకున్న కీలక అంశాల గురించి, కొంత మంది మంత్రులు మీడియాకు లీక్ చేస్తున్నారనే విషయాన్ని గుర్తించిన జగన్ కొంతమంది మంత్రులకు గట్టిగా క్లాస్ పీకినట్లు తెలుస్తోంది.