చైనా వాళ్ళు కనిపిస్తే కాల్చి వేయండి అని ఆర్డర్ వేసిన కిమ్

ప్రపంచానికి కరోనా ఎక్స్ పోర్ట్ చేసిన కారణం వల్ల కావచ్చు లేదా భారత్ మరియు సౌత్ చైనా సీ లోని ఇతర దేశాలతో ఘర్షణ వాతావరణానికి కారణమైందని కావచ్చు ప్రపంచ దేశాలన్నీ చైనా పై గుర్రుగా ఉన్నాయి అలాగే చైనాను ఐసోలేట్ చేయడం మొదలుపెట్టాయి.దానితో చైనాకు ఏం పాలుపోవాలో తెలియక తల పట్టుకుంటుంది.

 Kim Order To Kill Chinese People, Kim, Chaina, North Korea, Shoot To Kill, Chain-TeluguStop.com

సరిగ్గా ఇలాంటి టైమ్ లో చైనా కు మిత్ర దేశమైన నార్త్ కొరియా భారీ షాక్ ఇచ్చింది.అదేంటో ఇప్పుడు చూద్దాం.

నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ తాజాగా చైనా నుండి నార్త్ కొరియా వచ్చేవారి పై ‘షూట్ టు కిల్’ ఆదేశాలను జారీ చేశారు.అంతేకాకుండా చైనా నార్త్ కొరియా బోర్డర్ సమీపానికి భారీ ఎత్తున భద్రతా బలగాలను పంపారు.

చైనా మిత్ర దేశమైన నార్త్ కొరియా సడన్ గా ఇలాంటి డెసిషన్ తీసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.కరోనా వైరస్ కు పుట్టినిల్లయిన చైనా నుండి వచ్చేవాళ్ళ వల్ల ఎక్కడ నార్త్ కొరియాలో కరోనా వ్యాపిస్తుందో అనే భయంతో కిమ్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని దక్షిణ కొరియాలో అమెరికా బలగాల కమాండర్‌ జనరల్ రాబర్ట్ అబ్రహం అభిప్రాయపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube