వైరల్ వీడియో: చాలా ఏళ్ల తర్వాత కనిపించిన పాడే కుక్క...!

జంతు ప్రేమికులకు ఒక శుభవార్త.ఓ అరుదైన కుక్క ఇప్పుడు దాదాపు 50 ఏళ్ల తర్వాత మళ్ళీ మనకు కనిపించింది.

 Singing Dog Found In New Guinea, Rare Bread, Dog Singing, Viral, Harmonic Sounds-TeluguStop.com

మాములుగా మనం కుక్కల్ని ఇంట్లో పెంపుడు జంతువులుగా పెంచుకోవడం చూస్తుంటాము.అలాగే కొన్ని కుక్కలు వీధుల్లో విహారం చేస్తూ ఉండడం మనము చూసే ఉంటాము.

అయితే కుక్క కనిపిస్తే విచిత్రం ఏముంది అని అనుకుంటున్నారా… ! నిజంగా విచిత్రమే.ఎందుకంటే మనము చూసే కుక్కలు.

భౌ.భౌ అని అరుస్తూ ఉంటాయి కదా.కానీ, ఈ అరుదైన కుక్క పాటపడుతుందట.

పాడటమంటే మనలాగా కాదు.నక్కలు ఎలాగైతే అరుస్తాయో అలా అన్నమాట.అలా ఆ కుక్క కూడా ఔ… అంటూ పాడుతుంది.అంతేకాదు హంప్‌ బ్యాక్ వేల్ (తిమింగలం) ఎలాగైతే సౌండ్లు చేస్తుందో… అలాగే ఈ కుక్కలు కూడా అరుస్తాయట.తోడేళ్లలాగా తల పైకెత్తి… ఔ… అంటూ కూత పెడతాయి కుడా.

ఇప్పుడు ఈ కుక్క వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.

ఇకపోతే ఈ కుక్క అత్యంత అరుదైన జాతికి చెందిన కుక్క. 50 ఏళ్ల తర్వాత కనిపించిందంటే ఆ కుక్క ఎంత అరుదైనదో అర్థం చేసుకోవచ్చు.

అసలు ఈ కుక్కలు ఈ భూమిపై పూర్తిగా అంతరించిపోయాయని అందరు అనుకున్నారు.అప్పట్లో దాదాపు 200 కుక్కలు ఉండేవి.

చివరిసారిగా అలాంటి కుక్క 1970లో న్యూగినియాలో కనిపించింది.మళ్లీ ఇప్పుడు ఇండొనేసియాలో దర్శనమిచ్చింది.

ఈ కుక్కలకు అంత గుర్తింపు రావడానికి గల కారణం ఏంటంటే వాటి తోలు చూడడానికి మాములు కుక్కలలాగా ఉండదు.అలాగే ఇవి పాడే పాటల వల్ల ఇవి ప్రత్యేక గుర్తింపు పొందాయి.2016లో అరుదైన కుక్కల కోసం న్యూ గినియా హైల్యాండ్ వైల్డ్ డాగ్ ఫౌండేషన్ (NGHWDF) వేట ప్రారంభించింది.అయితే ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత దీన్ని కనుక్కుంది.

కుక్కల పరిశోధకుల్లో కొంత మంది న్యూగినియా నుంచి ఇండొనేసియా వెళ్లారు.అక్కడి పంకాక్ జయ ప్రదేశానికి వెళ్లినప్పుడు అడవుల్లో కుక్కల్ని చూశారు.

తర్వాత మరో టీమ్ ఇండొనేషియా వచ్చింది.ఈసారి అరుదైన కుక్కల బ్లడ్ శాంపిల్స్ తీసుకుంది.

అప్పుడు తెలిసింది 50 ఏళ్ల కిందట ఉండే ఆ కుక్కలు, ఇప్పుడు కనిపించిన కుక్క ఒకే జాతికి చెందింది అని.ఈ అరుదైన జాతి కుక్కలు అడవుల్లో తిరుగుతూ ఉంటాయి.అలా అక్కడి తోడేళ్లు, నక్కల సౌండ్లు విని అలాగే అరుస్తున్నాయేమో కాబోలు…!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube