పాము మనిషిని పగబడుతుందా.? అనే ప్రశ్నకు కొందరు అవునని కొందరు మాత్రం కాదని సమాధానం చెబుతుంటారు.అయితే ఈ విషయం గురించి తెలిస్తే మాత్రం పాము నిజంగానే మనుషులపై పగబడుతుందని నమ్మాల్సిన పరిస్థితి.తాజాగా ఒక మనిషిని ఒకే పాము ఏకంగా ఎనిమిది సార్లు కాటేసింది.
వినడానికి కొంత ఆశ్చర్యంగానే ఉన్నా ఈ ఘటన నిజంగానే చోటు చేసుకుంది.అయితే అన్నిసార్లు పాము కాటు వేసినా ఆ వ్యక్తి ఇప్పటికీ బ్రతికే ఉండటం గమనార్హం.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ వింత ఘటన చోటు చేసుకుంది.యశ్‌రాజ్ మిశ్రా అనే వ్యక్తి యూపీలోని రామ్ పూర్ గ్రామానికి చెందినవాడు.గడిచిన నెల రోజుల్లో ఎనిమిది సార్లు పాము కాటు వేయడంతో ఈ వ్యక్తి ఎనిమిది సార్లు ఆస్పత్రిలో చేరాడు.7 రోజుల క్రితం మిశ్రాను పాము కాటు వేయగా ప్రస్తుతం ఆస్పత్రిలో పాము కాటుకు చికిత్స పొందుతున్నాడు.పాము మిశ్రానే టార్గెట్ చేసి కాటు వేస్తుండటంపై అతని కుటుంబ సభ్యులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మిశ్రాను ఎనిమిది సార్లు పాము కాటు వేయడంపై అతని తండ్రి స్పందించి మీడియాతో మాట్లాడారు.
తన కుమారుడిని పాము కాటు వేసిందని తెలిసి తాము భయాందోళనకు గురయ్యామని.మూడు సార్లు ఒకే పాము కాటు వేయడంతో జాగ్రత్త వహించి తన కొడుకును బంధువుల ఇంటికి పంపానని అయితే అక్కడ కూడా తన కుమారుడిని పాము కాటు వేసిందని చెప్పారు.
పాము తన కుమారుడినే ఎందుకు టార్గెట్ చేసిందో తనకు కూడా అర్థం కావడం లేదని ఆయన పేర్కొన్నారు.
పాములు పట్టే వాళ్ళ ను పిలిపించినా, పూజలు చేయించినా ఫలితం లేకుండా పోయిందని… పాము కాటు వల్ల కుమారుడు మనోవేదనకు గురవుతున్నాడని మిశ్రా తండ్రి పేర్కొన్నారు.