కరోనా లాక్ డౌన్ కారణంగా ఎంతోమంది ఇంటి నుంచే ఉద్యోగాలు చేస్తున్నారు.ఇక మధ్యాహ్నం భోజనం చెయ్యగానే ఎంతోమంది నిద్రపోతున్నారు.
అలా మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్ర పోతే ఆరోగ్యానికి మంచిదే అనుకుంటున్నారా.? అయితే మీరు పొరపాటు పడినట్లే.మధ్యాహ్న భోజనం చేయగానే నిద్ర రావడం సాధారణమే.కానీ మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత నిద్ర పోతే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
భోజనం తర్వాత నిద్రపోవడం వల్ల అనారోగ్యానికి గురవుతారు.ఎందుకంటే పడుకున్న సమయంలో కడుపులో నుంచి కొంత మొత్తంలో జీర్ణరసాలు గురుత్వాకర్షణ శక్తి కారణంగా ఆహారం వైపు ప్రవహిస్తాయి.
దాని ఆమ్ల స్వభావం కారణంగా భోజనం నేరుగా గొంతు, నోటిలో మంటను కలిగిస్తుంది.
భోజనం తర్వాత నేరుగా నిద్రపోకుండా ఉండాలి.
ఎందుకంటే పడుకున్న సమయంలో ఆహారం మొత్తం జీర్ణాశయం మీద ఒత్తిడి తేవడం వల్ల గురక వస్తుంది.ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే భోజనం చేసిన తర్వాత ఒక గంట ఆగి నిద్రపోవడం మంచిది.
భోజనం చేసిన వెంటనే నిద్రపోతే హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గ్రీస్ లోని యూనివర్సిటీ ఐయోనిన మెడికల్ స్కూల్ లో జరిపిన ఒక అధ్యయనంలో వెల్లడైంది.అందుకే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కేవలం 45 నిమిషాలు మాత్రమే నిద్రపోవాలి.
అంతకుమించి నిద్రపోతే గుండెకు సంబంధించిన సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.