దేశ వ్యాప్తంగా హిందువులు సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న రామ మందిర నిర్మాణంకు భూమిపూజ జరిగింది.ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆధిత్య నాధ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఆ భూమి పూజ వేడుక జరిగింది.
సుప్రీం కోర్టు తీర్పుతో అయోద్యలో రామ మందిర నిర్మాణం ప్రారంభం అయ్యింది.ఇదే సమయంలో అక్కడే భారీ మసీదు నిర్మాణంకు కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
రామాలయంకు శంకుస్థాపన జరిగింది కనుక త్వరలోనే మసీదుకు కూడా శంకుస్థాపన జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా ఎవరు హాజరు అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది.
రామాలయంకు పీఎం మోడీ మరియు సీఎం యోగి ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు కనుక మసీదుకు కూడా వారినే ఆహ్వానించాలని ముస్లీం మతపెద్దలు భావిస్తున్నారు.సీఎం ఈ ఆహ్వానంపై ఎలా స్పందిస్తాడని అనుకుంటూ ఉండగా ఆయనే స్పందించారు.
తాను ఒక సీఎం అయ్యి ఉండవచ్చు.కాని అంతకు ముందు నేను ఒక హిందువును.
కనుక నేను ఎలా ఆ పనికి వెళ్తానంటూ వ్యాఖ్యలు చేశాడు.కనుక సీఎం మరియు పీఎంలలో ఎవరు కూడా మసీదు భూమి పూజకు కాని శంకుస్థాపనకు రాకపోవచ్చు అని తేలిపోయింది.
మరి ఈ విషయమై ముస్లీం మత పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారు అనేది చర్చనీయాంశంగా మారింది.