తెలుగు సినిమా పరిశ్రమలోకి హీరోయిన్ గా అడుగు పెట్టిన అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ బ్యూటీ “పూజ హెగ్డే” గురించి కొత్తగా సినీ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు ప్రస్తుతం షూటింగులు లేకపోవడంతో సోషల్ మీడియా మాధ్యమాల్లో బాగా యాక్టివ్ గా ఉంటోంది.
అంతేకాక తన బాడీ ఫిట్నెస్ కోసం యోగా మరియు జిమ్ వర్కౌట్లు చేస్తూ బాగానే కసరత్తులు చేస్తోంది.
ఐతే తాజాగా పూజా హెగ్డే యోగా చేస్తున్న సమయంలో తీసుకున్న ఫోటోలని తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది.
అయితే ఈ ఫోటోలో పూజా హెగ్డే యోగాఆసనాలు వేస్తూ తన శరీ రాన్ని విల్లులాగా వంచేసింది.దీంతో పూజా హెగ్డే అభిమానులు ఈ ఫోటోలని సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ చేస్తున్నారు.అంతేగాక పూజా హెగ్డే చాలా న్యాచురల్ బ్యూటీ అంటూ అల వైకుంఠపురంలో అనే చిత్రంలో అల్లు అర్జున్ చెప్పినటువంటి “మేడం సార్… మేడం అంతే.” అనే డైలాగ్ వల్లిస్తున్నారు.కాగా ఈ ఫోటోని షేర్ చేసిన ఒక్క రోజులోనే దాదాపుగా తొమ్మిది లక్షల పైచిలుకు లైకులు వచ్చాయి అంటే సోషల్ మీడియా మాధ్యమాలలో పూజా హెగ్డే కి ఉన్న ఫాలోయింగ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం పూజా హెగ్డే టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కేకే రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్నటువంటి రాధే శ్యామ్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.
అలాగే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న మరో బాలీవుడ్ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది.