ప్రస్తుత కాలంలో కొందరు సోషల్ మీడియా మాధ్యమాలలో అత్యుత్సాహం ప్రదర్శిస్తూ పాపులర్ కావాలనే ఉద్దేశంతో సెలబ్రిటీలు మరియు పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి వారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.తాజాగా బాలీవుడ్ ప్రముఖ నటి సుస్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్ భార్య చారు అసోప తనకు సంబంధించినటువంటి కొన్ని ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేసింది.
దీంతో కొందరు నెటిజన్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఆమెపై పలు అనుచిత వ్యాఖ్యలు చేశారు.ఇందులో ఓ నెటిజన్ ఏకంగా జాకెట్ కూడా వేసుకోవడం ఎందుకు.అది కూడా విప్పేయలంటూ అసభ్యకరంగా కామెంట్ చేశాడు.దీంతో ఈ విషయం గురించి కొందరు నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అలాగే సెలబ్రిటీలపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసే ముందు తమ ఇళ్లలోని ఆడపిల్లల గురించి కూడా ఒకసారి ఆలోచించాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా చారు అసోపా బాలీవుడ్లో పలు ధారావాహికలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించి బాగానే గుర్తింపు తెచ్చుకుంది.
కాగా మొత్తం 16 సీరియల్ లలో నటించింది.అలాగే రెండు చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రల్లో నటించినప్పటికీ ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేదు.దీంతో ఈ అమ్మడు సినీ పరిశ్రమ కంటే బుల్లితెర పైనే ఎక్కువగా దృష్టి సారించింది.