యంగ్ డైరెక్టర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో చెలరేగిపోయి నటిస్తున్నాడని, ఈ సినిమాతో ఆయన జాతీయ స్థాయి గుర్తింపును తెచ్చుకోవడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.
ఇక ఈ సినిమా తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తన నెక్ట్స్ మూవీని రెడీ చేసే పనిలో పడ్డాడు తారక్.
కాగా ఈ సినిమా తరువాత మరోసారి పాన్ ఇండియా మూవీపై కన్నేశాడు తారక్.
కన్నడలో తెరకెక్కిన కేజీఎఫ్ చిత్రం పాన్ ఇండియా మూవీగా సెన్సేషన్ క్రియేట్ చేసింది.దీంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కు ఎక్కడలేని క్రేజ్ వచ్చి పడింది.
దీంతో ప్రస్తుతం కేజీఎఫ్2 చిత్రాన్ని ఆయన తెరకెక్కిస్తున్నాడు.కాగా ఈ సినిమా తరువాత తారక్‌తో తన నెక్ట్స్ సినిమాను తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ డైరెక్టర్.
అయితే తారక్‌తో ప్రశాంత్ నీల్ చేయబోయేది భారీ బడ్జెట్ చిత్రమని తెలుస్తోంది.
కానీ కేజీఎఫ్ 2 చిత్రం ఎలాంటి రిజల్ట్‌ను దక్కించుకుంటుందో దాన్ని బట్టి తారక్-ప్రశాంత్ నీల్ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ కాంబోలో సినిమా పూర్తిగా కేజీఎఫ్ సీక్వె్ల్ సాధించే రిజల్ట్‌పైనే ఉంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.మరి కేజీఎఫ్ చిత్రం తారక్ నెక్ట్స్ చిత్రాన్ని డిసైడ్ చేస్తుండనడంలో ఎలాంటి సందేహం లేదు.
కాగా కేజీఎఫ్ 2 చిత్రంలో యష్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.