మలయాళ సూపర్ హిట్ మూవీ డ్రైవింగ్ లైసెన్స్‌ను పవన్ కళ్యాణ్ రీమేక్ చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్న విషయం తెల్సిందే.పృధ్వీరాజ్ పాత్రలో పవన్ కనిపించబోతున్నాడు.
భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఆ సినిమా రీమేక్ విషయమై గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలు సినీ వర్గాల్లో మరియు మెగా ఫ్యాన్స్‌లో చర్చనీయాంశం అయ్యింది.రామ్ చరణ్ డ్రైవింగ్ లైసెన్స్ రీమేక్ రైట్స్ కొనుగోలు చేశాడు అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

రామ్ చరణ్ నిర్మాణంలో పవన్ సినిమా ఉంటుందని గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది.ఇదే సమయంలో పవన్ కోసం అనే స్వయంగా రామ్ చరణ్ డ్రైవింగ్ లైసెన్స్‌ను తీసుకున్నట్లుగా మెగా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ రీమేక్‌ను ప్రముఖ నిర్మాతతో కలిసి రామ్ చరణ్ నిర్మించబోతున్నాడు.ఈ రీమేక్‌కు ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని త్వరలోనే రీమేక్‌కు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు.

పవన్ ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నాడు.ఆ మూడు సినిమాలు కూడా పూర్తి అయిన తర్వాతే ఈ రీమేక్ పట్టాలు ఎక్కే అవకాశం ఉంది.అంటే 2022లో కాని ఈ సినిమా విడుదలకు నోచుకునే అవకాశం లేదంటున్నారు.రామ్ చరణ్ నిర్మాతగా వరుసగా చిత్రాలు నిర్మిస్తున్నాడు.ఈ సమయంలోనే బాబాయి డేట్లు కూడా చరణ్ సంపాదించాడని తెలుస్తోంది.ఈ విషయమై చరణ్ నుండి అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.