మద్యం అమ్మకాలు నిలిపివేయాలి అంటూ పిటీషన్ వేసిన లాయర్ కు సుప్రీం కోర్టు గట్టి ఝలక్ ఇచ్చింది.పిటీషన్ వేసిన లాయర్ కు చీవాట్లు,జరిమానా విధించి పిటీషన్ ను తోసిపుచ్చింది.
మే 8న తమిళనాడు ప్రభుత్వానికి అక్కడి మద్రాస్ హైకోర్టు షాకిచ్చిన విషయం తెలిసిందే.రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలను మూసివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
కేవలం ఆన్‌లైన్ ద్వారా అమ్మకాలకు చేపట్టాలని… ఇంటికే మద్యం సరఫరా చేయేాలని స్పష్టం చేసింది.తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పరేషన్ ద్వారా నడిచే అన్ని షాపులను మూసివేయాలని ఆదేశాల్లో పేర్కొంది హైకోర్టు.
మద్యం షాపుల నిర్వహణ తీరుపై MNM అధినేత, సినీనటుడు కమల్ హాసన్‌తో పాటు పలువురు హైకోర్టులో పిటిషన్ వేశారు.దీనిపై విచారించిన జస్టిన్ వినీత్ కొటారి, జస్టిస్ పుష్ప సత్యానారాయణ నేతృత్వంలోని డివిజనల్ బెంచ్.
వైన్ షాపులను మూసివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.కేవలం ఆన్‌లైన్ అమ్మకాలకు మాత్రమే అనుమతిచ్చింది.
ఐతే ఆ తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించడం తో తమిళనాడులో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అయ్యింది.అంతేకాదు మద్యాన్ని నిషేధించాలని పిటిషన్ వేసిన లాయర్లకు రూ.లక్ష చొప్పున జరిమానా విధించింది.
పబ్లిసిటీ కోసమే పిటిషన్ వేశారంటూ చివాట్లు పెట్టింది లాక్ డౌన్ తో మొన్నటివరకు మద్యం దుకాణాలను మూసి ఉంచడం తో ఇటీవల లాక్ డౌన్ సడలింపులు నేపథ్యంలో కేంద్రం మద్యం దుకాణాల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
దీనితో దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా మద్యం దుకాణాలను తెరిచేందుకు వీలు కల్పించాయి.అయితే దీనిపై కొందరు వ్యతిరేకత చూపుతూ కోర్టులను ఆశ్రయిస్తుండగా సుప్రీం కోర్టు ఇలాంటి తీర్పు వెల్లడించింది.