స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’కు సంబంధించిన టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈ పోస్టర్‌ను రిలీజ్ చేయగా దానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ రఫ్ లుక్‌తో కనిపిస్తాడు.
కాగా ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడని, అతడి పేరు పుష్పరాజ్ అని ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.
ఈ క్రమంలో తాజాగా రిలీజ్ అయిన పోస్టర్లో బన్నీ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడినట్లు తెలుస్తోంది.అంటే బన్నీ ఈ సినిమాలో లారీ డ్రైవర్ కాదని, స్మగ్లింగ్ చేసే వ్యక్తిగా కనిపిస్తాడని ఓ వార్త వినిపిస్తుంది.
పైగా కథ చుట్టూ పుష్ప అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుందని,అందుకే ఈ సినిమాకు ఆ పేరును పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మొత్తానికి బన్నీ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇలా అనేక వార్తలు వచ్చేలా చేసింది.
మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసేంత వరకు ఆగాల్సిందే.