కరోనాకు మందు అంటూ మీథనాల్ తాగిన జనం,300 మంది మృతి

ప్రపంచ దేశాల్లో కరోనా విలయ తాండవం చేస్తున్న విషయం విదితమే.చైనా లో మొదలైన ఈ మహమ్మారి క్రమక్రమంగా ప్రపంచ దేశాలకు పాకింది.

 In Iran, False Belief A Poison Can Fight Novel Coronavirus Kills Hundreds, Iran-TeluguStop.com

దీనితో 197 దేశాలకు ఈ కరోనా పాకడం తో అపార జన నష్టానికి కారణమవుతుండగా, మరోపక్క కరోనా కు చికిత్స అని భావించి తీసుకున్న మందు వికటించడం తో ఇరాన్ లో 300 మంది మృత్యువాత పడినట్లు తెలుస్తుంది.మీథనాల్ అనే నాటుసారా కరోనా చికిత్స కు మంచి మందు అని అక్రమ ఆల్కహాల్ వ్యాపారాలు డబ్బులు దండుకోవడం కోసం చెప్పారు.

అయితే ప్రపంచాన్ని అల్లడిస్తున్న కరోనా చికిత్స కు నిజంగానే ఇది మంచి మందు అని భావించి ఆ విషాన్ని తీసుకున్నారు.దీనితో 300 మంది మృత్యువాత పడగా,మరో వెయ్యిమంది తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తుంది.

వారిలో కొందరికి కంటిచూపు కూడా పోయినట్లు తెలుస్తుంది.అమాయకప్రజల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని,దానికి తోడు దేశంలో ఆల్కహాల్ తాగడం పై నిషేధం ఉండడం తో ఈ చీప్ లిక్కర్ వ్యాపారాలు ఇలాంటి అమ్మకాలను సాగించారు.

అయితే ఇది సేవించిన అనేకమంది తీవ్రంగా అస్వస్థతకు గురవ్వడం తో చివరికి తమ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.

కరోనా వల్ల ప్రమాదమేమీ లేదని ప్రభుత్వం కూడా ఉదాసీనంగా వ్యవహరించడంతో అక్రమ ఆల్కహాల్ వ్యాపారులు ఈ విధంగా రెచ్చిపోతున్నారు.

మరోపక్క కరోనా కారణంగా ఇరాన్ లో ఇంకా అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నా .ఆ దేశ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది.ఇరాన్ లో కూడా కరోనా వల్ల దాదాపు 3 వేలకు పైగా మరణాలు సంభవించిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube