నందమూరి బాలకృష్ణ కొంత గ్యాప్ తరువాత మళ్లీ సినిమా చేస్తున్న సంగతి అందిరికీ తెలిసిందే.మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో బాలయ్య ఈ సినిమాను చేస్తున్నాడు.
ఇప్పటికే ప్రారంభమైన ఈ సినిమా ఇంకా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించలేదు.దీంతో బాలయ్య సినిమా ఎప్పుడు మొదలువుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ సినిమా ఇంకా రెగ్యులర్ షూట్ కూడా మొదలుకాకుండానే తన నెక్ట్స్ మూవీపై ఇండస్ట్రీ వర్గాల్లో ఓ ఆసక్తికరమైన వార్త హల్‌చల్ చేస్తోంది.బాలయ్య త్వరలో ఓ మలయాళ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడట.
అయ్యప్పనమ్ కోషియం అనే సూపర్ హిట్ మూవీని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు తెలుగు హక్కులను సొంతం చేసుకున్నారు.దీంతో ఈ సినిమాలో నటించేందుకు వారు బాలయ్యను సంప్రదించినట్లు తెలుస్తోంది.
కాగా బాలయ్య ఈ రీమేక్‌లో నటించే విషయంపై ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని తెలుస్తోంది.ఒకవేళ బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే మాత్రం ఈ సినిమాను వెంటనే తెలుగులో రీమేక్ చేసేందుకు నిర్మాతలు రెడీగా ఉన్నారు.
మరి మలయాళ హిట్ రీమేక్‌కు బాలయ్య ఓటు వేస్తాడా లేదా అనేది చూడాలి.