భారత్ పాకిస్తాన్ల మద్య చాలా ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న పీఓకే వివాదం ప్రస్తుతం మళ్లీ చర్చకు తెర లేపింది.ఆర్మీ చీప్ రావత్ గతంలో పీఓకే ఇండియాకే చెందుతుందని.
కొన్నాళ్ల తర్వాత అయినా పీఓకేను స్వాదీనం చేసుకుంటామంటూ ప్రకటించిన విషయం తెల్సిందే.కొత్తగా ఆర్మీ చీప్ బాధ్యతలు స్వీకరించిన ముకుంద్ నరవనే పీఓకేపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఆర్మీ చీప్ హోదాలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి.
ఆయన నెలవారి సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.
పీఓకే అనేది ఎప్పుడు కూడా ఇండియాదే అని, ఇండియాలోనే పీఓకే ఉందని ఎప్పుడైతే పార్లమెంట్ పీఓకేపై నిర్ణయం తీసుకుంటుందో ఆ వెంటనే తాము పీఓకేను ఇండియాలో కలిపేస్తాం అంటూ ఆర్మీ చీప్ ప్రకటించాడు.ప్రస్తుతానికి సరిహద్దు వెంబటి చొరబాట్లు లేకుండా చూస్తున్నామని.
పాకిస్తాన్ బ్యాట్ బలగాల నుండి ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నట్లుగా ఆయన ప్రకటించాడు.మోడీ ప్రభుత్వ హయాంలోనే పీఓకే ను ఖచ్చితంగా ఇండియాలో కలుపుకునే అవకాశం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.