ముఖ సౌందర్యం విషయంలో అందరూ ఎంతో కేర్ తీసుకుంటారు.ముఖ్యంగా అమ్మాయిలు ముఖాన్ని అందంగా, తెల్లగా మెరిపించుకోవడం కోసం వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.
కాస్ట్లీ స్కిన్ కేర్ ప్రోడెక్ట్స్‌ను వాడుతుంటారు.కాంతి వంతమైన చర్మం కోసం రకరకల టిప్స్‌ను ఫాలో అవుతుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ అండ్ ఎఫెక్టివ్ హోమ్ రెమెడీని ట్రై చేస్తే.చర్మంపై ఎటువంటి మచ్చలు ఉన్నా తొలగిపోవడమే కాదు ముఖం తెల్లగా, మృదువుగా మరియు కాంతివంతంగా కూడా మారుతుంది.
మరి ఇంకెందుకు లేటు ఆ రెమెడీ ఏంటీ.? ఎలా తయారు చేసుకోవాలి.? వంటి విషయాలపై లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.
ముందుగా కొన్ని నిమ్మ తొక్కలను సేకరించి ఎండలో బాగా ఎండబెట్టుకుని మెత్తగా పొడి చేసుకోవాలి.
అలాగే మిక్సీ జార్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల అవిసె గింజలు వేసి పొడి చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నెను పెట్టుకుని ఒక కప్పు ఆవ నూనెను పోయాలి.
నూనె కాస్త హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్ల అవిసె గింజల పొడి, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మ తొక్కల పొడి వేసి పది నుంచి పడిహేను నిమిషాల పాటు హీట్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇప్పుడు హీట్ చేసుకున్న మిశ్రమాన్ని చల్లారబెట్టుకుని.అప్పుడు స్ట్రైనర్ సాయంతో నూనెను మాత్రం సపరేట్ చేసుకోవాలి.ఈ నూనెను ఒక బాటిల్‌లో నింపి స్టోర్ చేసుకుంటే.
ఇరవై రోజుల పాటు వాడుకోవచ్చు.దీనిని ఎలా యూస్ చేయాలంటే.
మొదట ముఖాన్ని వాటర్‌తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఆపై తయారు చేసుకున్న నూనెను అప్లై చేసుకుని కనీసం పదిహేను నిమిషాల పాటు స్మూత్‌గా మసాజ్ చేసుకోవాలి.
మసాజ్ అనంతరం గంట పాటు చర్మాన్ని డ్రై అవ్వనిచ్చి.అప్పుడు గోరు వెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా రోజూ గనుక చేస్తే చర్మంపై ఉండే మచ్చలు, ముడతలు క్రమంగా తగ్గిపోతాయి.స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది.మరియు మృదువైన, కోమలమైన చర్మాన్ని తమ సొంతం చేసుకోవచ్చు.