సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంతో విజయశాంతి దాదాపు 15 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెల్సిందే.ఎప్పుడెప్పుడా అంటూ ఆమె అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి గెస్ట్ గా పాల్గొనబోతున్నాడు అనగానే అంతా కూడా ఒకింత ఆసక్తిని కనబర్చారు.ఎందుకంటే ఆ వేడుకలో చిరంజీవి మరియు విజయశాంతి ఎదురు పడుతారు.
అప్పుడు వారి ఫీలింగ్స్ ఎలా ఉంటాయి.ఒకరిని ఒకరు ఎలా పలకరించుకుంటారు అని అంతా అనుకున్నారు.
రాజకీయాల్లో ఉన్న సమయంలో చిరంజీవిని విజయశాంతి విమర్శలు చేసింది.కాని గతంలో 20 సినిమాల్లో కలిసి నటించి దాదాపు అన్ని సూపర్ హిట్స్ చేసుకున్నారు.అలాంటి జంటకు 1980 ప్రేక్షకులు ఎంతగా అభిమానులో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.వీరిద్దరి జంట అంటే అప్పటి జనాలు సినిమాను సక్సెస్ చేసేవారు.
అంతటి క్రేజీ కాంబో అయిన వీరిద్దరు విభేదాల కారణంగా దూరం అయ్యారు.దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ వీరిద్దరు ఎదురు పడ్డారు.ఈ సమయంలో ఇద్దరు ఒకరిపై ఒకరికి ఉన్న గొడవలను పక్కకు పెట్టారు.మనసు విప్పి మాట్లాడుకుని కన్నుళ పండుగగా చేశారు.సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ వేడుక సందర్బంగా చిరంజీవి మరియు విజయశాంతిల మద్య జరిగిన ఎపిసోడ్ అప్పటి ప్రేక్షకులు ఒల్లు గగుర్లు పొడిచే విధంగా ఉంది.కొంత మంది ఫ్యాన్స్‌కు కళ్లు కూడా చెమర్చాయి.
చిరంజీవి మరియు విజయశాంతిలు కూడా ఎమోషనల్ అయ్యి కన్నీరు పెట్టుకున్నారా అనిపించింది.అంతటి ఎమోషనల్ సన్నివేశంకు కారణం అయిన మహేష్ బాబుకు అంతా థ్యాంక్స్ చెబుతున్నారు.మా కలయికకు కారణం అయిన మహేష్‌కు థ్యాంక్స్ అంటూ చిరంజీవి స్టేజ్‌పైనే చెప్పగా ఈ జంట అభిమానులు మాత్రం మహేష్ బాబు కారణంగానే కలిశారు అంటూ చేతులు ఎత్తి దండం పెడుతూ మరీ థ్యాంక్స్ చెబుతున్నారు.నిజంగానే మహేష్ బాబు చొరవ వల్లే కదా ఇన్నాళ్లకు చిరంజీవి మరియు విజయశాంతి కలిసింది.