సంక్రాంతికి రాబోతున్న సరిలేరు నీకెవ్వరు చిత్రం సూపర్ హిట్ అవ్వడం ఖాయం అంటూ చిరంజీవి చెబుతున్న ఒక సెంటిమెంట్‌ను బట్టి చూస్తుంటే అనిపిస్తుందని సూపర్ స్టార్ ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు.నిన్న ఎల్బీ స్టేడియంలో నభూతో నభవిష్యత్తి అన్న రీతిలో జరిగిన సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు అయిన విషయం తెల్సిందే.
ఈమద్య కాలంలో సూపర్ స్టార్ వేడుక కాని మరే ఇతర వేడుక కాని ఇంత సరదాగా ఇంత అహ్లాదకరంగా సాగింది లేదు.చిరంజీవి ఈ కార్యక్రమం మొత్తం మూడ్ ను మార్చేశాడు.
మెగాస్టార్ చిరంజీవి కార్యక్రమంలో మాట్లాడుతూ రష్మికపై ప్రశంసలు కురిపించాడు.ఆమె చాలా అందంగా ఉండటంతో పాటు మంచి నటి అన్నాడు.ఆ అమ్మాయి చాలా చెలాకి అమ్మాయి అంటూ రష్మిక పై చిరంజీవి చేసిన ప్రశంసలు అందరిని ఆకట్టుకున్నాయి.ఇక రష్మిక మొదటి సినిమా ఛలో ప్రీ రిలీజ్ వేడుకకు నేను హాజరు అయ్యాను, అలాగో ఆమె నటించిన గీత గోవిందం సినిమా మా వాళ్లు నిర్మించారు కనుక ఆ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు వెళ్లాను.
ఆ రెండు మంచి విజయాలు సాధించిన విషయం తెల్సిందే.ఇప్పుడు మళ్లీ ఈ సినిమా వేడుకకు కూడా వచ్చాను.
ఈ సినిమాలో కూడా హీరోయిన్ ఆమెనే.ఇదంతా చూస్తుంటే రష్మిక నన్ను కాంట్రాక్ట్ తీసుకుని తన అన్ని సినిమాల వేడుకలకు రప్పించుకుంటుందా అనిపిస్తుందంటూ చిరంజీవి కామెంట్స్ చేశాడు.రష్మిక నటించిన గత సినిమాల్లో రెండింటి ప్రీ రిలీజ్ వేడుకలకు చిరంజీవి హాజరు అవ్వడం సూపర్ హిట్ అవ్వడం జరిగింది.ఇప్పుడు మెగాస్టార్ ఈ వేడుకకు కూడా హాజరు అయ్యాడు కనుక బ్లాక్ బస్టర్ ఖాయం అంటూ మెగా మరియు సూపర్ స్టార్ ఫ్యాన్స్ చాలా నమ్మకంతో అంటున్నారు.