మానవ చరిత్రలో లెక్కలేనంత మంది అమాయకులు కేవలం వారి జాతి లేదా జాతీయత కారణంగా ధన, మాన, ప్రాణాలను కోల్పోతున్న సంగతి తెలిసిందే.వర్తమానంలోకి వస్తే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని స్థానికులు విదేశీయులపై జాత్యహంకార దాడులకు పాల్పడుతున్నారు.
రంగు, లింగం, డబ్బు లేదంటే తమ అవకాశాలను విదేశీయులు తన్నుకుపోతున్నారని భావిస్తున్న స్థానిక అమెరికన్లు భౌతిక దాడులకు పాల్పడటమో లేదంటే ప్రాణాలు తీయడమో చేస్తున్నారు.
ఇక ఈ ఏడాది అమెరికా నగరాల్లో లెక్కకు మించి ద్వేషపూరిత దాడులు బాగా పెరిగినట్లు కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ చేసిన పరిశోధనలో తేలింది.
ముఖ్యంగా న్యూయార్క్, లాస్ఏంజిల్స్, చికాగో, హ్యూస్టన్, ఫీనిక్స్ నగరాల్లో ఈ తరహా దాడులు ఎక్కువగా నమోదయ్యాయి.సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ హేట్ అండ్ ఎక్స్‌ట్రీమిజం నివేదిక ప్రకారం.
అమెరికాలో ఎక్కువగా యూదు కమ్యూనిటీయే దాడులకు లక్ష్యంగా మారుతోంది.

కొద్దిరోజుల క్రితం న్యూయార్క్‌లో యూదుల పండుగ హనుక్కా వేడుక సందర్భంగా ఓ మత ప్రబోధకుడి ఇంట్లోకి చొరబడిన ఓ ఆగంతకుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి పారిపోయాడు.ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.ఈ ఘటనపై స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ.
అమెరికాలో తరచుగా దాడులు జరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.న్యూయార్క్ మేయర్ సైతం యూదులు నివసించే ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే.
ఇక నగరాల వారీగా వస్తే:
* అమెరికా ఆర్ధిక రాజధాని న్యూయార్క్ 415 విద్వేష దాడులతో ఈ ఏడాది అగ్రస్థానంలో నిలిచింది.2001 నుంచి ఈ తరహా దాడులు నగరంలో పెరుగుతూ వస్తున్నాయి.

* లాస్ ఏంజిల్స్ 309 విద్వేషపూరిత దాడులతో రెండో స్థానంలో నిలిచింది.2018లో ఈ దాడులు 290గా నమోదయ్యాయి.యూదు వ్యతిరేక దాడులు రెట్టింపై 58కి చేరుకోగా.నల్లజాతీయులపై 18 శాతానికి పెరిగాయి.
* 96 ఘటనలతో చికాగో మూడో స్థానంలో నిలిచింది.9/11 ఉగ్రవాద దాడుల తర్వాత ఇక్కడ విద్వేష దాడులు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.యూదు వ్యతిరేక దాడులు గతేడాదితో పోలిస్తే 46 శాతం పెరిగాయి.
* ఫీనిక్స్, హ్యూస్టన్ నగరాల్లో గతేడాదితో పోలిస్తే విద్వేష దాడులు 25 శాతం పెరిగాయి.