జార్ఖండ్ సీఎంగా ముక్తి మోర్చా నేత హేమంత్ సొరేన్ ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే.అయితే ఈ కార్యక్రమం కోసం పలువురు రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు.
ఈ నేపధ్యంలో నా ప్రమాణ స్వీకారానికి బొకేలు తేవొద్దు వాటి బదులు పుస్తకాలు తీసుకురండి అవే నాకు ఇష్టం అని తెలిపారు.ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ ని ఓడించి జేఎంఎం,కాంగ్రెస్,ఆర్జేడీ కూటమి అత్యధిక ఓట్లు సాధించి జార్ఖండ్ లో అధికారాన్ని చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో జేఎంఎం నేత హేమంత్ సోరెన్ జార్ఖండ్ సీఎం గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.మొత్తం 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్లో JMM 30 సీట్లు గెలవగా… కాంగ్రెస్ 16, RJD 1 సీటు దక్కించుకున్నాయి.
ఫలితంగా హేమంత్ సోరెన్ ఇవాళ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

ఆయనతోపాటూ… కాంగ్రెస్, RJD ఆర్జేడీల నుంచీ ఒక్కొక్క మంత్రి కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని కాంగ్రెస్ నేతలు చెప్పారు.ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రియాంక గాంధీ, NCP చీఫ్ శరద్ పవార్, టీడీపీ అధినేత చంద్రబాబు, DMK చీఫ్ ఎంకే స్టాలిన్, మధ్యప్రదేశ్ సీఎం కమల్నాథ్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాత్, ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బాఘేల్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్, RJD నేత తేజశ్వీ యాదవ్ తదితరులు వస్తున్నట్లు సమాచారం.ఈ ఎన్నికల్లో బీజేపీ పార్టీ 25 స్థానాలకే పరిమితమైంది.