బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ తెలుగులో మహేష్‌బాబుతో భరత్ అనే నేను చిత్రంలో నటించి సక్సెస్ దక్కించుకుంది.ఆ వెంటనే రామ్ చరణ్‌తో చేసిన వినయ విధేయ రామ చిత్రం నిరాశ పర్చింది.
ఆ సినిమా ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోక పోవడంతో తెలుగులో పెద్దగా ఆఫర్లు ఈ అమ్మడికి రాలేదు.దాంతో బాలీవుడ్‌కే పరిమితం అయ్యింది.
బాలీవుడ్‌లో కబీర్ సింగ్ చిత్రంలో నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్ దక్కించుకుంది.అర్జున్ రెడ్డిలో నటించిన షాలిని పాండేకు పెద్దగా గుర్తింపు రాలేదు కాని రీమేక్ కబీర్ సింగ్‌లో నటించిన కియారాకు మాత్రం మంచి గుర్తింపు దక్కింది.
ఆ చిత్రం తర్వాత కియారా మొత్తం కెరీర్ మారిపోయిందని చెప్పుకోవచ్చు.ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోలు ఈ అమ్మడి డేట్ల కోసం ఎదురు చూస్తున్నారంటూ సమాచారం అందుతోంది.
అన్ని వర్గాల వారిని ఆకట్టుకున్న కియారా ఫొటో షూట్‌లతో అప్పుడప్పుడు ఫ్యాన్స్‌కు కన్నుల విందు చేస్తుంది.తాజాగా కూడా ఒక మాస్ లుక్‌తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసింది.
వైట్ అండ్ వైట్‌తో ఒక మాస్ ఫోజ్‌తో అబ్బ అనిపించేలా ఈ అమ్మడు ఆకట్టుకుంది.కియారా అద్వానీ ఈ మాస్ ఫోజ్‌పై మీరు ఒక లుక్కేయండి.