ఏపీలో పత్రిక స్వేచ్చను ప్రభుత్వం హరిస్తుందని, పత్రికల గొంతు నొక్కేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ కొందరు ప్రతిపక్ష నాయకులు జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.కొన్ని మీడియా సంస్థలపై ప్రభుత్వం అనధికారికంగా ఆంక్షలు పెట్టినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఈ విషయమై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ప్రముఖంగా చర్చ జరుగుతోంది.ఈ సమయంలోనే మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు మాట్లాడుతూ ఇష్టానుసారంగా మాట్లాడేస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకుని ఉండాలి.అసలు మాకు అంటూ ఎలాంటి మనోభావాలు ఉండకూడదా.తుపాకి పట్టుకుని కాల్చుతూ ఉన్నా కూడా మేము సైలెంట్‌గా చూస్తూ ఉండాలా అంటూ ప్రశ్నించాడు.పత్రిక స్వేచ్చకు తాము అస్సలు వ్యతిరేకం కాదని, కాని ఏపీలో ఉన్న పత్రికలు చాలా విభిన్నంగా ఉన్నాయని ప్రభుత్వంకు ఎప్పుడు కూడా వ్యతిరేకంగా ఉంటున్నాయంటూ ఆరోపించాడు.
ప్రభుత్వంపై కక్ష కట్టినట్లుగా పత్రిక యజమానులు వ్యవహరిస్తున్నారు.వారే సుప్రీం కోర్టు కంటే పెద్ద అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారంటూ నాని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
మీడియా సంస్థ అధినేతలు తమ విలేకర్లతో తప్పుడు వార్తలు రాయించవద్దని సూచించాడు.