యాక్షన్ సినిమాల బ్రాండ్ అంబాసిడర్ గా పేరు తెచ్చుకున్న వివి వినాయక్ ఈ మధ్య కాలంలో దర్శకుడిగా సక్సెస్ కాలేక పోతున్నాడు.దాంతో ఈయన హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.
దిల్ రాజు ఈ సినిమాను నిర్మించబోతున్నాడు.ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు.
సినిమా ఫేస్ లుక్ మరియు టైటిల్ ను దసరా సందర్భంగా ప్రకటించారు.
వినాయక్ సినిమా టైటిల్ ను సీనయ్య గా ఖరారు చేశారు.ఫస్ట్ లుక్ లో దర్శకుడు వినాయక్ పెద్ద రెంచి పట్టుకుని మెడలో కామ్రేడ్ టవల్ వేసుకుని మాస్ లుక్ లో ఆకట్టుకుంటున్నాడు.గతంతో పోల్చితే చాలా సన్నగా అవ్వడంతో పాటు వినాయక్ వయసు కూడా చాలా తక్కువ కనిపిస్తుంది.
ఒక సైడు నుండి చూస్తే చిరు పోలికలు ఉన్నాయని అంటున్నారు.అందుకే సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.ఈ సినిమాకు నరసింహా రావు దర్శకత్వం చేస్తున్నాడు.