టీవీ9 నిధుల గోల్ మాల్ కేసులో మాజీ సీఈఓ రవి ప్రకాష్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.అరెస్ట్ అయిన రవి ప్రకాష్ కు 14 రోజుల పాటు కోర్టు రిమాండ్ విధించింది.
కోర్టు సెలవులు కారణంగా ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నాడు.జైల్లో ఉన్న ఆయన్ను కుటుంబ సభ్యులు కలిశారు.
ఇదే సమయంలో రవి ప్రకాష్ ను కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కలిశారు.
రవి ప్రకాష్ ను కలిసిన వారిలో రాజకీయ నేత రేవంత్ రెడ్డి మాత్రమే.
ములాఖత్ సమయంలో రవిని రేవంత్ రెడ్డి కలిశారు.ఈ సందర్భంగా అరెస్టుకు దారి తీసిన పరిస్థితులు మరియు ఇతర విషయాలను అడిగి తెలుసుకున్నాడని సమాచారం అందుతోంది.
రేవంత్ రెడ్డి కి మరియు రవి ప్రకాష్ కు మొదటి నుండి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.అందుకే రవిని రేవంత్ రెడ్డి జైలు వద్ద కలిసినట్లుగా సమాచారం.